పాపం... కారులోనే చిన్నారి మృతదేహం

First Published Oct 17, 2017, 11:03 AM IST
Highlights
  • సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం అమీన్ పూర్ వాసులుగా గుర్తింపు
  • ఆర్థిక కారణాలతోనే ఆత్మహత్యలకు పాల్పడినట్లు పోలీసుల గుర్తింపు
  • అప్పుల బాధలో ఉన్నట్లు చెబుతున్న మృతుల బంధువులు

సంగారెడ్డి జిల్లా, కొల్లూరు గ్రామ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు పై ఐదు మృతదేహాలు దొరకడం సంచలనం రేకెత్తించింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలిలా ఉన్నాయి.

సంగారెడ్డి జిల్లా, పటాన్ చెరు మండలంలోని అమీన్ పూర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు గత మూడు రోజుల క్రితం ఎపి 28 డిఎం 3775 అనే కారులో బయటకు వెళ్లారు. అయితే వారు ఎక్కడికి వెళ్లారో తెలియకపోవడంతో అనుమానం వచ్చిన వారి బంధువులు పటాన్ చెరు పోలీసు స్టేషన్ లో రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు.

అయితే ఈరోజు కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డుపై ఐదు మృతదేహాలు లభ్యం కావడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదు మృతదేహాల్లో ఒక  మూడేళ్ళ పసి బాలుడి మృతదేహం కారులోనే లభించింది. ఆ చిన్నారితోపాటు మరో మధ్య వయసు ఉన్న వ్యక్తి మృతదేహం కూడా కారులో దొరికింది. మూడేళ్ల పసి బాలుడిగా గుర్తించారు పోలీసులు. అయితే మరో మూడు మృతదేహాలు మాత్రం రోడ్డుకు కొంచెం దూరరంగా పడి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు.

స్థానికులు ఈ మరణాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. వారి వద్ద లభించిన సెల్ ఫోన్ ఆధారంగా మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

మృతులు అమీన్ పూర్ కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. అయితే వీరి మరణానికి ఆర్థిక ఇబ్బందులే కారణంగా పోలీసులు చెబుతున్నారు. వారి బంధువులు కూడా ఆర్థిక ఇబ్బందుల్లోనే ఈ కుటుంబం ఇలా చేసి ఉండొచ్చని అంటున్నారు. మృతదేహాలకు ఎలాంటి రక్త గాయాలు లేకపోవడంతో ఆత్మహత్యగానే పరిగణిస్తున్నారు. అయితే వీరు ఎలా మూకుమ్మడి ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నదానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

చనిపోయిన వారి పేర్లు గుర్తించిన పోలీసులు. వారి వివరాలివి... చనిపోయిన వారిలో ప్రభాకర్ రెడ్డి, మాధవి, వర్షిత, లక్ష్మి, సింధూజ ఉన్నట్లు చెబుతున్నారు. అయితే మూడేళ్ల పసిబాబుతోపాటు ఇంకో మృతదేహాలు కారులో గుర్తించగా మిగిలిన ముగ్గురు మృతదేహాలను రోడ్డు పక్కన చెట్లల్లో గుర్తించారు. వారి బంధుత్వాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

ఈ మూకుమ్మడి ఆత్మహత్యలపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/zrDApr

 

click me!