రైతు సంక్షేమమే ఎజెండాగా తమ పార్టీ ముందుకు సాగుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ ఇవాళ టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్: తెలంగాణ మోడల్ దేశంలో అమలు కావాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.బుధవారం నాడు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి ముందుగా తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగించారు. జాతీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు దారి తీసిన పరిస్థితులను కేసీఆర్ వివరించారు. జాతీయ రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లాల్సి వస్తుందనే విషయమై కేసీఆర్ తెలిపారు.
బీజేపీ అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలో వెనుకబడిపోతుందన్నారు. బంగ్లాదేశ్ కంటే మన దేశం వెనుకబడి ఉండడం ఏమిటని కేసీఆర్ ప్రశ్నించారు. అఖిలేష్ యాదవ్ ను ఈ సమావేశానికి రావొద్దని తానే చెప్పినట్టుగా తెలిపారు. ములాయం సింగ్ యాదవ్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారన్నారు. ఈ కారణంగానే తాను అఖిలేష్ ను రావొద్దని చెప్పానన్నారు. ములాయం కోలుకున్న తర్వాత అందరం కలిసి వస్తారనే ఆకాంక్షను కేసీఆర్ వ్యక్తం చేశారు. దేశ ప్రజల కోసమే బీఆర్ఎస్ ను ఏర్పాటు చేస్తున్నట్టుగా కేసీఆర్ చెప్పారు. రైతు సంక్షమమే ఎజెండాగా ముందుకు సాగుతామని కేసీఆర్ వివరించారు. మహరాష్ట్ర నుండి పర్యటనను ప్రారంభించనున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు. కర్ణాటకలో కూడా మన జెండా ఎగురాలని ఆయన ఆకాంక్షించారు.
undefined
దేశంలో చాలా పార్టీలకు రాజకీయం క్రీడలా మారిందన్నారు. తనకు మాత్రం రాజకీయం ఓక టాస్క్ అని కేసీఆర్ చెప్పారు. దేశంలలో రైతుల పరిస్థితి చాలా అధ్వాన్నంగా మారిందన్నారు. ఆహార భద్రత ఉన్న రాష్ట్రంలో పుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ పై ఆధారపడడం సిగ్గు చేటన్నారు. విదేశాల నుండి ప్రాసెసింగ్ ఫుడ్ దిగుమతి చేసుకోవడం దారుణమని ఆయన చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటకలోనే మన మొదటి కార్యక్షేత్రాలని ఆయన తెలిపారు.
బీఆర్ఎస్ విజయవంతం కావాలని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కోరుకున్నారు. తెలంగాణలో అమలౌతున్న పథకాలు బాగున్నాయన్నారు. తెలంగాణలో అమలౌతున్న పథకాలు దేశంలో అమలు కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
also read:టీఆర్ఎస్ ఇక నుండి బీఆర్ఎస్: విస్తృత స్థాయి సమావేశం తీర్మాణం
ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ చేసిన తీర్మానాన్ని కేసీఆర్ చదివి విన్పించారు. ఈ తీర్మానాన్ని కేసీఆర్ చదివి విన్పించే సమయంలో ప్రతినిధులు చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు.