తెలంగాణ దేశానికే ఆదర్శం: సీఎం కేసీఆర్

By Mahesh RajamoniFirst Published Oct 5, 2022, 1:36 PM IST
Highlights

Hyderabad: తెలంగాణ దేశానికే ఆదర్శమ‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ధర్మ స్థాపనకు సంకేతంగా దేశ వ్యాప్తంగా దసరా ఉత్సవాలను జయప్రదం చేసే విజయదశమిగా జరుపుకుంటున్నామని తెలిపారు.
 

Telangana Chief Minister KCR: తక్కువ కాలంలోనే తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచేలా అభివృద్ధిని సాధించిందని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు  (కేసీఆర్) అన్నారు. తెలంగాణ స్ఫూర్తితో దేశం ప్రగతి పథంలో ముందుకు సాగాలని దసరా సందర్భంగా ప్రజలకు ఇచ్చిన సందేశంలో ఆకాంక్షించారు. టీఆర్ఎస్ ప్ర‌భ‌త్వం తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టిందని అన్నారు. ధర్మ స్థాపనకు సంకేతంగా దేశ వ్యాప్తంగా దసరా ఉత్సవాలను జయప్రదం చేసే విజయదశమిగా జరుపుకుంటున్నామని తెలిపారు. దసరా పండుగ రోజున ప్రజలు పాలపిట్ట (ఇండియన్ రోలర్ పక్షి)ని గుర్తించి పవిత్రమైన జమ్మి చెట్టును పూజించడం గొప్ప సంప్రదాయమని ఆయన అన్నారు. జమ్మి ఆకులాంటి బంగారాన్ని ఇచ్చిపుచ్చుకోవడమే దసరా పండుగ ప్రత్యేకతనీ, పెద్దల ఆశీర్వాదం పొందాలని, అలాయ్ బలయ్‌లో పాల్గొని ప్రేమ, ఆప్యాయతలను చాటుకోవాలని కేసీఆర్ పేర్కొన్నారు.

విజయానికి సంకేతమైన దసరా రోజున చేపట్టిన పనులన్నీ సత్ఫలితాలనివ్వాలని ప్రార్థించారు. విజయ దశమి స్ఫూర్తి ఇలాగే కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. 

 

Chief Minister Sri K. Chandrashekar Rao extended greetings to the people of the State on the occasion of . CM said that Dussehra is celebrated across the country as a mark of establishment of Dharma and as that brings victories. pic.twitter.com/W2KHQMtrtI

— Telangana CMO (@TelanganaCMO)

 

పవిత్ర జమ్మి ఆకును అక్కడ హాజరైన వారందరికీ పంచిన సీఎం కేసీఆర్ పరస్పర శుభాకాంక్షలు అందించి, ఆశీర్వదించారు. అనంతరం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, సిఎం వో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 

పవిత్ర జమ్మి ఆకును అక్కడ హాజరైన వారందరికీ పంచిన సీఎం కేసీఆర్ పరస్పర శుభాకాంక్షలు అందించి, ఆశీర్వదించారు.

అనంతరం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, సిఎం వో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. pic.twitter.com/cOHIC7cv6y

— TRS Party (@trspartyonline)

అలాగే, దసరా సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటగా నల్ల పోచమ్మ ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి వృక్షానికి వేద పండితుల సమక్షంలో సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. 

 

దసరా సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మొదటగా నల్ల పోచమ్మ ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి వృక్షానికి వేద పండితుల సమక్షంలో సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. pic.twitter.com/6g8SM3loKn

— TRS Party (@trspartyonline)
click me!