ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ( MLC election) అభ్యర్థుల ఎంపికను టీఆర్‌ఎస్ (TRS) శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. రేపటితో నామినేషన్ల (mlc nomination) ప్రక్రియ ముగియనుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఇందుకు సంబంధించిన కసర్తతును పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ( MLC election) అభ్యర్థుల ఎంపికను టీఆర్‌ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకు సంబంధించిన కసర్తతును పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, సామాజిక సమీకరణాలు, జిల్లాల ప్రాతినిధ్యం, పార్టీ పట్ల విధేయత తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థుల ఎంపికపై ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. పార్టీ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆయన అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో.. నేటి సాయంత్రం అభ్యర్థులను ఖరాలు చేయనున్నారు. దీంతో అభ్యర్థులు రేపు నామినేషన్లు దాఖలు చేసుకోవడానికి వీలు కలుగుతుంది. వీటితో పాటు గవర్నర్ కోటాలో అభ్యర్థిని కూడా కేసీఆర్ ఖరారు చేయనున్నారు.
ఇక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా పనిచేసిన akula lalitha, ఫరీదుద్దీన్, గుత్తా సుఖేందర్ రెడ్డి (gutta sukender reddy), నేతి విద్యాసాగర్ రావు, బోడకుంట వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి పదవీలం ఈ ఏడాది జూన్ 3తో ముగిసింది. స్థానాలకు గతంలోనే ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికలను ఈసీ వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా కరోనా ఉధృతి తగ్గిన నేపథ్యంలో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
undefined
అసెంబ్లీలో భారీ మెజారిటీ ఉన్నందున్న ఆరు స్థానాల్లో కూడా టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమైనట్టే. అయితే ఈ ఎమ్మెల్సీ బరిలో నిలవడానికి తాజా మాజీలతో పాటు, పలువురు సీనియర్ నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ స్పీకర్ మధుసూదనచారి (madhusudhana chary), మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎర్రోళ్ల శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి, కోటిరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అలాగే gutta sukender reddy, ఇటీవల టీడీపీని వీడి గులాబీ కండువా కప్పుకున్న ఎల్ రమణ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.
గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఖాయమైనప్పటికీ.. ఎమ్మెల్యే కోటాలో ఆయన బరిలో నిలుస్తారా..? లేక స్థానిక సంస్థల కోటాలో బరిలో నిలుస్తారా..? గవర్నర్ కోటాలో మండలికి పంపుతారా అనేది తేలాల్సి ఉంది. గుత్తా సుఖేందర్‌రెడ్డిని గవర్నర్ కోటాలో మండలికి పంపితే.. గవర్నర్ కోటాలో పెండింగ్‌లో కౌషిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాకు మార్చే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. అయితే ఆశావహులు భారీగా ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై గులాబీ బాస్ అచితూచీ వ్యవహరిస్తున్నట్టుగా సమాచారం.
ఇక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి నవంబర్ 9న నోటిఫికేషన్ వెలువడింది. రేపటితో నామినేషన్ల స్వీకరణ ముగియనుంది. 17వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు వచ్చేనెల 22 వరకు అవకాశం కల్పించారు. నవంబర్ 29న ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ నిర్వహించనున్నారు. మరోవైపు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 16వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 23వ తేదీన నామినేషన్లకు అఖరి తేదీగా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై కూడా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.