MLC Elections 2021: కేసీఆర్ కాళ్లు మొక్కిన మాజీ అధికారి వెంకట్రామిరెడ్డికి చిక్కులు

By telugu teamFirst Published Nov 17, 2021, 11:01 AM IST
Highlights

సిద్ధిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి చిక్కులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీగా ఆయన అభ్యర్థిత్వాన్ని సవాల్  చేయాలని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని టీపీసీసీ నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో తెలంగాణ శాసన మండలికి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపికైన సిద్ధిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి చిక్కులు తప్పేట్లు లేవు. ఆయన అభ్యర్థిత్వంపై తెలంగాణ కాంగ్రెసు పార్టీ ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేసింది. ఆయన నామినేషన్ ను తిరస్కరించాలని తెలంగాణ కాంగ్రెసు ఎన్నికల అధికారిని కోరారు. ఇందుకుగాను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీమంత్రి షబ్బీర్ అలీ,చిన్నారెడ్డి తో పాటు ఇతర కాంగ్రెసు నేతలు ఇవాళ మండలి రిటర్నింగ్ ఆఫీసర్ ఉపెందర్ రెడ్డి ని కలిసారు.

తన కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన మర్నాడే Venkatrami Reddyని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఆరుగురిని ఎమ్మెల్యే కోటాలో ఆయన ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థులుగా KCR ఎంపిక చేశారు. వారు మంగళవారం తమ నామినేషన్లను దాఖలు చేశారు. అయితే, వెంకట్రామిరెడ్డి అభ్యర్థిత్వాన్ని తెలంగాణ కాంగ్రెసు తప్పు పడుతోంది. 

Also Read: MLC elections: టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ట్విస్ట్.. ఎంపీ బండ ప్రకాష్‌కు టికెట్.. అందుకోసమేనా..?

డీఓపీ అనుమతి లేకుండా వెంకట్రామిరెడ్డి రాజీనామాను కేసీఆర్ ప్రభుత్వం ఆమోదించడాన్ని కాంగ్రెసు తీవ్రంగా పరిగణిస్తోంది. డీవోపీలో వెంకట్రామిరెడ్డిపై ఫిర్యాదులున్నాయని ఆరోపిస్తోంది. ఐఏఎస్ గా పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయంటూ వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ ఆభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 

వెంకట్రామిరెడ్డిపై ఉన్న ఆరోపణలను, భూసేకరణలో హైకోర్టు ఆయనకు శిక్ష విధించిన విషయంతో పాలు పలు అంశాలతో కాంగ్రెసు పార్టీ ఓ నివేదిక తయారు చేసింది. ఆ నివేదికను జతచేస్తూ ఎన్నికల అధికారికి తెలంగాణ కాంగ్రెసు ఫిర్యాదు చేసింది. ఆయన నామినేషన్ ను తిరస్కరించాలని అందులో విజ్ఞప్తి చేసింది.

వెంకట్రామిరెడ్డి అభ్యర్థిత్వంపై తెలంగాణ కాంగ్రెసు పార్టీ న్యాయపోరాటం కూడా చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన కాంగ్రెసు ఇకపై కోర్టుకు ఎక్కాలని నిర్ణయించుకుంది. దీంతో వెంకట్రామిరెడ్డికి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. సిద్ధిపేట కలెక్టర్ గా ఉన్నప్పుడు వెంకట్రామిరెడ్డి కేసీఆర్ కాళ్లు మొక్కడం వివాదాస్పదంగా మారింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న Banda Prakashను కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు ఇంకా మూడేళ్ల పదవీకాలం ఉంది. అయినప్పటికీ ఆయనను ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేశారు. ఆయన స్థానంలో తన కూతురు, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రాజ్యసభకు పంపించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. బండా ప్రకాశ్ ను ఈటల రాజేందర్ వల్ల మంత్రివర్గంలో ఏర్పడిన ఖాళీలో భర్తీ చేస్తారని భావిస్తున్నారు. బండా ప్రకాశ్ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు. ఈటల రాజేందర్ కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించినవారు. దీంతో సమతూకం అవుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. 

Also Read: బండా ప్రకాశ్ తో సహా ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్.. ఏకగ్రీవాలే..

ఇదిలావుంటే, సీనియర్ నేతలు కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్ రావు పేర్లను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవులకు కేసీఆర్ ఎంపిక చేశారు. హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నికలకు ముందు కాంగ్రెసును వీడి టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటా కింద శాసన మండలికి సిఫార్సు చేశారు. అయితే, ఆ ఫైల్ ను గవర్నర్ తమిళిసై పెండింగులో పెట్టారు. కొన్ని అభ్యంతరాలున్న దృష్ట్యా ఆయనను తన కోటాలో శాసన మండలికి పంపించడానికి ఆమె ఇష్టపడలేదు. దీంతో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి పంపేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 

click me!