sirpurkar commission విచారణ: 'ఆ ముగ్గురు మైనర్లే, చర్లపల్లి జైలుకు ఎందుకు తరలించారు'

Published : Nov 16, 2021, 09:59 PM IST
sirpurkar commission విచారణ: 'ఆ ముగ్గురు మైనర్లే, చర్లపల్లి జైలుకు ఎందుకు తరలించారు'

సారాంశం

దిశ నిందితుల ఎన్ కౌంటర్ విషయమై సిర్పూర్కర్ కమిషన్ విచారణ ఇవాళ జరిగింది. ఈ విచారణకు  మృతుల కుటుంబాల సభ్యుల తరపున న్యాయవాది వాదించారు. ఈ ఎన్ కౌంటర్ బూటకపు ఎన్ కౌంటరేనని వాదించారు.

హైదరాబాద్:దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ బూటకపు ఎన్‌కౌంటరేనని మృతుల తరపు న్యాయవాది సిర్పూర్కర్ కమిషన్ ముందు వాదించారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై  సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ ఎన్ కౌంటర్ పై కమిషన్ విచారణ నిర్వహిస్తుంది. ఇవాళ ఎన్ కౌంటర్ లో మరణించిన మృతుల కుటుంబ సభ్యులు విచారణకు హాజరయ్యారు. బాధిత కుటుంబ సభ్యుల తరపున న్యాయవాది వాదించారు.

ఈ ఎన్‌కౌంటర్ లో మరణించిన వారిలో ముగ్గురు మైనర్లే ఉన్నారని మృతుల కుటుంబ సభ్యుల తరపు న్యాయవాది సిర్పూర్కర్ కమిషన్ ముందుంచారు. అయితే నిందితుల్లో ముగ్గురు మైనర్లే ఉన్నా వారిని జువైనల్ హోంకు తరలించకుండా చర్లపల్లి జైలుకు ఎందుకు తరలించారని ప్రశ్నించారు. ఇది ముమ్మూటికీ బూటకపు ఎన్‌కౌంటరే అని ఆయన కమిషన్ ముందు వాదించారు.

2019 నవంబర్ 27వ తేదీన  disha పై నలుగురు నిందితులు అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశారు. మృతదేహన్ని షాద్‌నగర్ కు సమీపంలో చటాన్‌పల్లి వద్ద ఆమె మృతదేహన్ని దగ్దం చేశారు. దిశపై అత్యాచారం చేసిన నిందితులను ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ముహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు గా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు.

also read:ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు అంటే అర్ధం తెలియదు: సిర్పూర్కర్ కమిషన్‌తో సజ్జనార్

ఈ ఘటనకు సంబంధించి దిశ నిందితులతో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో ఎన్‌కౌంటర్ చోటు చేసుకొంది. 2019 డిసెంబర్ 6వ తేదీన చటాన్‌పల్లి వద్ద నిందితులు encounter లో మరణించారు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో తమపై దాడి చేసి కాల్పులకు దిగారని పోలీసులు తెలిపారు. 

ఈ ఎన్‌కౌంటర్ లో నలుగురు నిందితులు మరణించారు. అయితే ఈ నలుగురి ఎన్‌కౌంటర్ బూటకమని హక్కుల సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు sirpurkar commission ను ఏర్పాటు చేసింది. కరోనా కారణంగా సిర్పూర్కర్ కమిషన్ విచారణ ఆలస్యమైంది. సిర్పూర్కర్ కమిషన్ హైద్రాబాద్ వేదికగా చేసుకొని విచారణను వేగవంతం చేసింది.

గత మాసంలో ఈ ఎన్‌కౌంటర్ లో పాల్గొన్న పోలీస్ అధికారుల నుండి సిర్పూర్కర్ కమిషన్ విచారణ నిర్వహించింది.ఈ ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో సైబరాబాద్ సీపీగా ఉన్న వీసీ సజ్జనార్ తో పాటు శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డితో పాటు ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులను కమిషన్ విచారణ నిర్వహించింది.ఈ ఎన్‌కౌంటర్ బూటకమని పౌరహక్కుల సంఘం నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్ ను ఏర్పాటు చేసింది.

ఎన్ కౌంటర్ సమయంలో నిందితులపై కాల్పులు జరపాలని ఎవరు ఆదేశాలు జారీ చేశారని కూడా సిర్పూర్కర్ కమిషన్ ముందు హాజరైన ఏసీపీ సురేందర్ ను ప్రశ్నించింది.  కమిషన్ ముందు ఐపీఎస్ అధికారి సజ్జనార్ రెండు దఫాలు హాజరయ్యారు. ఎన్ కౌంటర్ కు దారి తీసిన పరిస్థితులను ఏసీపీ సురేందర్ కమిషన్ కు వివరించారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు