ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం.. పీయూష్ గోయల్‌ని కలిసిన తెలంగాణ మంత్రులు

By Siva Kodati  |  First Published Nov 23, 2021, 8:28 PM IST

మంగళవారం ఢిల్లీలోని కృషి భవన్‌లో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, అధికారుల బృందం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వరి కొనుగోళ్లపై చర్చించారు. రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారిన ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని తెలంగాణ మంత్రుల బృందం కేంద్రాన్ని కోరుతోంది. 


కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో (piyush goyal) తెలంగాణ మంత్రులు, ఎంపీలు భేటీ అయ్యారు. యాసంగిలో వడ్డ కొనుగోలుపై (paddy issue) టార్గెట్ తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని పట్టుబడుతోంది. దీనిలో భాగంగా మంగళవారం ఢిల్లీలోని కృషి భవన్‌లో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, అధికారుల బృందం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వరి కొనుగోళ్లపై చర్చించారు. 

రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారిన ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని తెలంగాణ మంత్రుల బృందం కేంద్రాన్ని కోరుతోంది. తెలంగాణ రాష్ట్రం నుంచి యాసంగి పంటలో ఎంత ధాన్యం? ఏ రూపంలో కొనుగోలు చేస్తారో? తేల్చాలని ప్రశ్నించింది. రాష్ట్రంలో రైతుల ఇబ్బందులు సహా అందుబాటులో ఉన్న ధాన్యం రబీ పంట కొనుగోళ్ల అంశాలను కేంద్ర మంత్రికి తెలంగాణ మంత్రులు వివరించారు. 

Latest Videos

undefined

ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ (somesh kumar).. మంత్రులు కేటీఆర్ (ktr), నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్ బాయిల్డ్ బియ్యం తీసుకోమని తేల్చి చెప్పారు పీయూష్ గోయల్. అయితే ఏడాదికి 120 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకోమని మంత్రుల బృందం కోరింది. అయితే 70 లక్షల టన్నులు తీసుకుంటామని చెప్పారు గోయల్. ఈ నేపథ్యంలో ఈ నెల 26న మరో సారి గోయల్‌ను కలవనుంది మంత్రుల బృందం. సమావేశం ముగిసిన  తర్వాత నేరుగా సీఎం కేసీఆర్ (kcr)దగ్గరకు వెళ్లారు మంత్రులు, ఎంపీలు . 

ALso Read:వరిపై పోరు: ఢిల్లీకి బయలు దేరిన కేసీఆర్, కేంద్రంతో తాడోపేడో

కాగా.. వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రం తీరుపై టీఆర్ఎస్ పోరాటం  చేస్తోంది. ఇప్పటికే ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసింది. ఈ నెల 18న ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నాకు దిగింది టీఆర్ఎస్. కేంద్రం నుండి రెండు మూడు రోజుల్లో స్పష్టత రాకపోతే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని ఇందిరా పార్క్ వద్ద మహ ధర్నా సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు.

వరి ధాన్యంపై తాడోపేడో తేల్చుకొనేందుకు కేసీఆర్ రెండ్రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లారు. ధాన్యం కొనుగోలు అంశానికి  సంబంధించి ఎఫ్‌సీఐకి ఆదేశాలు ఇవ్వాలని కూడా కేసీఆర్ ప్రధానిని కోరారు. బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేయబోమని కేంద్రం తేల్చి చెప్పింది. రా రైస్ కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో ఉన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో యాసంగిలో బాయిల్డ్ రైస్ మాత్రమే  ఉత్పత్తి అవుతుందని తెలంగాణ సర్కార్ చెబుతుంది.. కేంద్రం ధాన్యం కొనుగోలుకు సిద్దంగా లేనందునయాసంగిలో వరి పంట వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది.

click me!