ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో కేసీఆర్ అమీ తుమీ : ఢిల్లీకి టీఆర్ఎస్ మంత్రుల బృందం

Siva Kodati |  
Published : Dec 18, 2021, 10:12 PM IST
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో కేసీఆర్ అమీ తుమీ : ఢిల్లీకి టీఆర్ఎస్ మంత్రుల బృందం

సారాంశం

ధాన్యం కొనుగోళ్లకు (Paddy Issue) సంబంధించిన అంశంపై కేంద్రంతో తేల్చుకునేందుకు సీఎం కేసీఆర్‌ (kcr) రెడీ అయ్యారు. ఆయన ఆదేశాల మేరకు టీఆర్ఎస్ బృందం ఢిల్లీకి బయలుదేరింది. 

ధాన్యం కొనుగోళ్లకు (Paddy Issue) సంబంధించిన అంశంపై కేంద్రంతో తేల్చుకునేందుకు సీఎం కేసీఆర్‌ (kcr) రెడీ అయ్యారు. ఆయన ఆదేశాల మేరకు టీఆర్ఎస్ బృందం ఢిల్లీకి బయలుదేరింది. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (niranjan reddy), గంగుల కమలాకర్ (gangula kamalakar), ఎర్రబెల్లి దయాకర్ రావు (errabelli dayakar rao), జగదీశ్వర్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు ఎంపీలు ఈ బృందంలో ఉన్నారు.

ఈ క్రమంలో అధికారులు ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) , కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ (piyush goyal) అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వానాకాలం ధాన్యానికి సంబంధించి అదనపు ధాన్యం సేకరణపై ఇప్పటి వరకు ఎలాంటి ఆమోదం, నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఈ క్రమంలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రంతో మరోసారి మాట్లాడాలని నిర్ణయించారు. ఆది, సోమవారాల్లో ప్రధాని, కేంద్రమంత్రితో మంత్రుల బృందం సమావేశమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ALso Read:యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు.. కొత్త జోనల్ ప్రకారమే ఉద్యోగుల విభజన... సీఎం కేసీఆర్

అంతకుముందు యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు (paddy procurement centres) ఉండవని సీఎం కేసీఆర్ (KCR) మరోసారి స్పష్టం చేశారు. జిల్లాల‌ కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో శనివారం  విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, సీఎస్ సోమేశ్ కుమార్, పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ, లాభసాటి పంటల దిశగా రైతులను మళ్లించాలని అధికారులకు సూచించారు. రైతుల్లో అవగాహన పెంచే బాధ్యతను అధికారులు తీసుకోవాలని అన్నారు. వచ్చే వానాకాలం పంటలపై కూడా ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశించారు. వానాకాలంలో ముఖ్యంగా పత్తి, వరి, కంది సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు.  

మరోవైపు ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉద్యోగుల విభజనపై కలెక్టర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో (telangana) జరుగుతున్న ఉద్యోగుల విభజనపై కలెక్టర్లకు సీఎం కేసీఆర్ (KCR) కీలక ఆదేశాలు జారీచేశారు. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగుల విభజన అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్త జోనల్ వ్యవస్థ ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ కల్పన జరుగుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు మారుమూల ప్రాంతాలకు వెళ్లి పనిచేస్తేనే సమగ్రాభివృద్ది జరుగుతుందని తెలిపారు. 4,5 రోజుల్లో ఉద్యోగ విభజన ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. విభజన పూర్తి చేసి నివేదిక తనకు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు