మంత్రి కేటీఆర్ సంతకం ఫోర్జరీ:విచారణకు ఆదేశం

By Nagaraju penumalaFirst Published Oct 4, 2019, 10:30 AM IST
Highlights

తన సంతకం ఫోర్జరీపై మంత్రి కేటీఆర్ సైతం తీవ్రంగా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. తన సంతకం ఫోర్జరీ జరిగిందని తాను ఎవరికీ ఎలాంటి రికమండేషన్ లెటర్ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. సంతకం ఫోర్జరీ చేసిన అంశంపై విచారణకు ఆదేశించారు మంత్రి కేటీఆర్. 

హైదరాబాద్: ఉన్నత స్థాయి పోస్టు కోసం ఓ ప్రభుత్వ ఉద్యోగి అడ్డదారులు దొక్కి అడ్డంగా బుక్కయ్యారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి దొరికిపోయారు. ఇప్పుడు ఈ వార్త తెలంగాణ వ్యాప్తంగా హల్ చల్ చేస్తోంది. 

వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లా రావులపెంట ప్రభుత్వ  పాఠశాలలో పనిచేస్తున్న హెచ్ఎం మంగళ జిల్లా కో ఆర్డినేటర్ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా మంత్రి కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఒక రికమండేషన్ లెటర్ ను సైతం సృష్టించారు. 

ఆ రికమండేషన్ లెటర్ ను పట్టుకుని జిల్లా కో ఆర్డినేటర్ పదవి కోసం ప్రయత్నించి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. మంత్రి కేటీఆర్ సంతకం ఫోర్జరీ చేసినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. 

click me!