చంద్రబాబు హైదరాబాద్ ఆస్తులపై తలసాని సంచలన వ్యాఖ్యలు

By Arun Kumar PFirst Published Apr 13, 2019, 1:00 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో లబ్ధి కోసమే చంద్రబాబు తమపై బురదజల్లే ప్రయత్నం చేశాడని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేవలం తనకు మాత్రమే ఏపి  ప్రజలపై ప్రేమున్నట్లు మాట్లాడాడని...ఇక్కడ తెలంగాణ లో ఏపి ప్రజలు, నాయకులపై టీఆర్ఎస్ ప్రభుత్వం దాడులు చేస్తోందంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. ముఖ్యంగా హైదారాబాద్ లో ఆస్తులున్నవారిని బెదిరించామని, కొట్టామని ఆయన ఆరోపించడాన్ని తప్పుబట్టాడు. చంద్రబాబు నిజాయితీ గల  నాయకుడైతే ముందు హైదరాబాద్ లోని తన ఆస్తులను అమ్ముకొవాలని తలసాని సూచించారు. 

ఏపిపై చంద్రబాబుకు ప్రేమ వుంటే తెలంగాణలో ఆస్తులన్ని అమ్ముకొని శాశ్వతంగా ఆంధ్రాకు వెళ్లిపోవాలని సూచించారు. అంతేకానీ కేవలం హైదరాబాద్ నివసిస్తున్నఏపికి చెందిన సామాన్య ప్రజల్లో  వైషమ్యాలు సృష్టించడానికి ప్రయత్నించవద్దని కోరారు. ఐదు ఓట్ల కోసం  నీచంగా మాట్లాడటం మానుకోవాలని హెచ్చరించారు.  చంద్రబాబు మాటలతో ఇక్కడున్న తెలుగు దేశం వాళ్లకు కూడా బుద్ది వచ్చి వుంటుందని తలసాని తెలిపారు. 

ఇక అయ్యా కొడుకులు(చంద్రబాబు, లోకేశ్) కలిసి ఏపి ఎన్నికల్లో చాలా డ్రామాలాడారని ఘాటుగా విమర్శించారు. మంగళగిరిలో లోకేశ్ ఓ రసవత్తర డ్రామా నడిపించి తండ్రిని మించిన కొడుకు అనిపించుకున్నాడని విమర్శించారు. కేవలం మూడు నాలుగు చోట్ల  గొడవలైతే  రాష్ట్రం మొత్తం అల్లకల్లోలంగా మారిందని చంద్రాబాబు ప్రచారం చేస్తున్నారన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో వున్న స్పీకర్ కోడెల కూడా నాటకాలాడటం ఆశ్యర్యంగా అనిపించిందని పేర్కొన్నారు. 

ఇక కేంద్ర ప్రభుత్వం ఈసీపై ఒత్తిడి తెచ్చి అధికారులను మార్చారని ఆరోపించడాన్ని కూడా తలసాని తప్పుబట్టారు. కొంత  మంది ఉద్యోగులను మాత్రమే ఈసీ మార్చిందని అన్నారు. అలాగే ఈసీ నియమించిన చీఫ్ సెక్రటరీ ఓ ఏజంట్ అని... ఆయనపై కేసులున్నాయని అనడం దారుణమన్నారు. ఏం చంద్రబాబు పై కేసులు లేవా...ఆయన స్టేలు తీసుకుని బయట వుండటం లేదా అని తలసాని ప్రశ్నించారు. చిల్లరగా, దిగజారిపోయి మాట్లాడి పరువు తీసుకోవద్దని చంద్రబాబును తలసాని తీవ్రంగా హెచ్చరించారు. 

click me!