పరువు హత్య కేసు.. నిందితుడు ఆత్మహత్య

Published : Apr 13, 2019, 08:42 AM IST
పరువు హత్య కేసు.. నిందితుడు ఆత్మహత్య

సారాంశం

వేరే కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో ఓ యువతిని దారుణంగా హత్యచేశారు. ఈ పరవు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి తాజాగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వేరే కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో ఓ యువతిని దారుణంగా హత్యచేశారు. ఈ పరవు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి తాజాగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  మండలంలోని కలమడుగు గ్రామానికి చెందిన అనురాధ (22), అయ్యోరు లక్ష్మణ్‌ గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. గత డిసెంబరు 22న వధువు తండ్రి పిండి సత్తన్న, సోదరుడు మహేశ్‌ తదితరులు అనురాధను దారుణంగా హత్య చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఏ-16 నిందితుడిగా ఉన్న పిండి ఆంజనేయులు శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కొన్నాళ్ల క్రితం బెయిల్‌పై వచ్చిన ఆంజనేయులు.. కేసులో తనకు ఎలాంటి శిక్ష పడుతుందేమోనని తీవ్ర ఆందోళనతో ఉన్నాడు.

 ఈ క్రమంలో శుక్రవారం పొలంలో పురుగు మందుతాగాడు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న తమ్ముడు ఆది మల్లేశ్‌ ఏం జరిగిందని ప్రశ్నించగా.. కేసులో తీర్పు ఎలా వస్తుందోనన్న భయంతోనే ఆత్మహత్యకు యత్నించానని చెప్పాడు. వెంటనే మల్లేశ్ తన సోదరుడు ఆంజనేయులను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
Governor Shiv Pratap Shukla Speech: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూపర్ స్పీచ్