నేడు మీడియా సమావేశం:గవర్నర్‌తో భేటీకి సంకేతాలిచ్చిన మంత్రి సబితా

By narsimha lodeFirst Published Nov 9, 2022, 2:24 PM IST
Highlights

తెలంగాణ యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు 2022 బిల్లుపై గవర్నర్ తో చర్చించేందుకు సిద్దంగా ఉన్నట్టుగా ప్రభుత్వం సంకేతాలు పంపింది. గవర్నర్ అపాయింట్ మెంట్ ఇవ్వగానే  కలిసేందుకు సిద్దంగా ఉన్నామని ప్రభుత్వవర్గాలు సంకేతాలు ఇచ్చాయి.

హైదరాబాద్: తెలంగాణ యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు 2022 బిల్లుపై గవర్నర్ తో  చర్చించేందుకు వెళ్లేందుకు  మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా విద్యాశాఖ అధికారులు సన్నద్దమయ్యారు. ఇవాళ సాయంత్రం గవర్న,ర్ తమిళిసై సౌందరరాజన్  మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే అదే గవర్నర్ అపాయింట్ మెంట్ ఇస్తే తాము గవర్నర్ ను కలిసేందుకు సిద్దంగా ఉన్నామని ప్రభుత్వం సంకేతాలు పంపింది.

రెండు మూడు రోజులుగా   ఈ విషయమై ప్రభుత్వానికి, గవర్నర్ కి మధ్య వివాదం సాగుతుంది.  ఈ బిల్లుపై చర్చించేందుకు రావాలని గవర్నర్ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సమాచారం పంపినట్టుగా రాజ్ భవన్ వర్గాలుు చెబుతున్నాయి. కానీ తమకు ఎలాంటి సమాచారం రాలేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి  ప్రకటించారు.గవర్నర్ కు అన్ని విషయాలు చెబుతానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్ది సంకేతాలుఇచ్చారు.లీగల్ సహా అన్ని విషయాలపై క్లారిటీ ఇవ్వనున్నట్టుగా  మంత్రి సానుకూలంగా సంకేతాలు ఇచ్చారు. 

alsoread:మేసేంజర్ ద్వారా సమాచారం:మంత్రి సబితా కామెంట్స్ పై రాజ్ భవన్

అయితే  సెప్టెంబర్ లోనే ఈ విషయమై మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మేసేంజర్ ద్వారా సమాచారం పంపినట్టుగా రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. ఈ  పరిణామాల నేపథ్యంలో ఇవాళ సాయంత్రం నాలుగున్నర గంటలకు గవర్నర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే అదే సమయంలో తాము గవర్నర్ ను కలిసేందుకు సిద్దంగా ఉన్నామని విద్యాశాఖాధికారులు సన్నద్దతను వ్యక్తం చేశారు.మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా విద్యాశాఖాధికారులు గవర్నర్ తో ఈ విషయమై చర్చించేందుకు సిద్దంగా ఉన్నట్టుగా  సంకేతాలు ఇచ్చారు.గవర్నర్ అపాయింట్ మెంట్  కోసం చూస్తున్నామని  ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఈ బిల్లుపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ యుజీసీకి కూడ లేఖ రాశారు.రాష్ట్రంలో పలు యూనివర్శిటీల్లో  విద్యార్ధుల సమస్యలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరా తీశారు.పలు యూనివర్శిటీల్లో సమస్యలను తెలుసుకున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులతో ఆమె సమావేశమయ్యారు. రాజ్ భవన్ వచ్చి పలు  యూనివర్శిటీల విద్యార్ధులు గవర్నర్ తో భేటీ అయ్యారు. విద్యార్ధుల సమస్యలపై గవర్నర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.యూనివర్శిటీల్లో ఖాళీగా  పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసకువచ్చిన బిల్లుపై గవర్నర్ కు కొన్ని సందేహలున్నాయి. ఈ విషయమై చర్చించేందుకు రావాలని సమాచారం పంపితే ప్రభుత్వం నుండి సానుకూలంగా సమాధానం రాలేదు. అయితే అదే సమయంలో గవర్నర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకంది.

click me!