మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అస్వస్థత... యశోదా హాస్పిటల్లో అడ్మిట్

By Arun Kumar P  |  First Published Dec 13, 2023, 7:28 AM IST

ఇటీవలే ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించి రేవంత్ కేబినెట్ లో చోటుదక్కించుకున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యాారు. దీంతో ఆయన యశోదా హాస్పిటల్లో చేరారు. 


హైదరాబాద్ : తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల సమయంలోనే ఆయనకు గొంతు నొప్పి ప్రారంభంకాగా తాజాగా మరింత ఎక్కువయ్యింది. దీంతో ఆయన సోమాజిగూడ యశోదా హాస్పిటల్లో చేరారు.

తెలంగాణ రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ రాజధాని న్యూడిల్లీకి వెళ్లారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎంపీ పదవికి రాజీనామా చేసారు. లోక్ సభ స్పీకర్ ను కలిసి తన రాజీనామా లేఖను అందించారు. అలాగే తెలంగాణలోని జాతీయ రహదారుల విస్తరణ చేపట్టాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ను కోరారు. ఇలా గత సోమవారం డిల్లీకి వెళ్లిన కోమటిరెడ్డి తాజాగా హైదరాబాద్ కు చేరుకున్నారు. 

Latest Videos

Read More   ఏపీకి ప్రత్యేక హోదా.. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు

అయితే ఎన్నికల సమయంలో విరామంలేకుండా ప్రచారంలో పాల్గొనడం... ఎక్కువగా ప్రసంగించాల్సి రావడంతో కోమటిరెడ్డి త్రోట్ ఇన్పెక్షన్ కు గురయ్యారు. ఇక ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా ఇది మరింత ఎక్కువయ్యింది. దీంతో డిల్లీ నుండి హైదరాబాద్ కు చేరుకున్న వెంటనే చికిత్స కోసం యశోదా హాస్పిటల్లో చేరారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆయనను పరిక్షించిన వైద్యులు ఈ ఇన్ఫెక్షన్ తో పెద్దగా ప్రమాదమేమీ లేదని చెబుతున్నారు.   

ఇదే సోమాజిగూడ యశోదా హాస్పిటల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చికిత్స పొందుతున్నారు. ప్రమాదవశాత్తు ఫామ్ హౌస్ బాత్రూంలో జారిపడ్డ కేసీఆర్ తీవ్రంగా గాయపడ్డారు. తుంటి ఎముక విరగడంతో ఆయనకు యశోదా హాస్పిటల్ వైద్యులు ఆపరేషన్ జరిగింది. దీంతో కొద్దిరోజులుగా ఆయన హస్పిటల్లోనే వుంటున్నారు. ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి కూడా హాస్పిటల్లో చేరడంతో పోలీస్ సెక్యూరిటీని మరింత పెంచారు.  

click me!