CM Revanth Reddy: 10వ తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమర్ధవంతంగా నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ సచివాలయంలో బీఆర్ అంబేద్కర్ విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు.
CM Revanth Reddy: త్వరలో జరుగనున్న పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను అత్యంత పకడ్బందిగా, ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. గతంలో జరిగిన పేపర్ లీకేజీలు, ఇతర ఇబ్బందులను ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ.. పరీక్షల సమయంలో విద్యార్థులు ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా ఉండే విధంగా సాఫీగా పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు.
మంగళవారం నాడు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో విద్యా శాఖపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ శ్రీ నవీన్ మిట్టల్, విద్యా శాఖ కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ, సీఎంఓ కార్యదర్శి శ్రీ శేషాద్రి, విద్యా శాఖ కమిషనర్ శ్రీమతి దేవసేనలు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న విశ్వ విద్యాలయాల పనితీరుపై సవివరమైన నివేదిక అందచేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
undefined
రాష్ట్రంలో విశ్వ విద్యాలయాల పనితీరుపై సవివరమైన నివేదికతోపాటు, రాష్ట్రంలో ఎక్కడ జూనియర్ కళాశాలలు అవసరం ఉన్నాయో వాటి వివరాలు వెంటనే సమర్పించాలని కోరారు. ప్రధానంగా బాలికల కోసం జూనియర్ కళాశాలలు ఎక్కడ అవసరమో పరిశీలించి వాటికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలని స్పష్టం చేశారు.
అంతకుముందు రోజు.. TSPSC నిర్వహించిన పోటీ పరీక్ష పేపర్ల లీకేజీ , వాయిదాపై తీవ్ర పరిశీలనను ఎదుర్కొన్న తర్వాత TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. ఇది తెలంగాణ నిరుద్యోగ యువతలో విస్తృతమైన గందరగోళం , నిరాశకు దారితీసింది.
గ్రూప్ I, II, III, IV పరీక్షల షెడ్యూల్‌ను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు , పరీక్షా విధానంపై విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. తెలంగాణ ఈ సవాళ్లతో పోరాడుతున్నందున, రాష్ట్ర ఔత్సాహిక నిపుణుల భవిష్యత్తుకు కీలకమైన TSPSC కార్యకలాపాల సమగ్రత, న్యాయబద్ధతను నిర్ధారించడంపై దృష్టి కేంద్రీకరించబడింది.