మళ్లీ అదే తొండి మాట.. రైతుల నోట్లో మట్టిగొట్టే యత్నం: బండి సంజయ్‌‌పై జగదీశ్ రెడ్డి ఆగ్రహం

By Siva KodatiFirst Published Nov 21, 2021, 5:39 PM IST
Highlights

తెలంగాణ బీజేపీ నేతలపై ఫైరయ్యారు మంత్రి జగదీశ్ రెడ్డి (jagadeesh reddy) .  రాష్ట్ర బీజేపీ నేతలు ఎవరి మెడలు వంచుతారని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రైతుల నోట్లో మట్టిగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. బండి సంజయ్ మళ్లీ అదే తొండి మాట మాట్లాడుతున్నారని జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు

తెలంగాణ బీజేపీ నేతలపై ఫైరయ్యారు మంత్రి జగదీశ్ రెడ్డి (jagadeesh reddy) . ఆదివారం తెలంగాణ  భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర బీజేపీ నేతలు ఎవరి మెడలు వంచుతారని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రైతుల నోట్లో మట్టిగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. బండి సంజయ్ మళ్లీ అదే తొండి మాట మాట్లాడుతున్నారని జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. ఏ పంట కావాలనేది పంట పండించక ముందు చెప్పాలి కదా అని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. మీ తప్పుడు నిర్ణయాల వల్ల వందలాది రైతులు చస్తున్నా మీకు సోయి లేదంటూ ఆయన ఫైరయ్యారు. రైతులు ఇప్పుడు ఏ విత్తనం తెచ్చి నారు పోయాలని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. 

అంతకుముందు తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana cm kcr) కేసీఆర్‌పై (kcr) విరుచుకుపడ్డారు బీజేపీ (bjp) రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (bandi sanjay). కేసీఆర్ దీక్ష (kcr deeksha) చేస్తే ఢిల్లీ దిగొచ్చిందంట అంటూ సెటైర్లు వేశారు. కేసీఆర్ దీక్ష చేసింది తెలంగాణ రైతుల (telangana farmers) కోసమా..? పంజాబ్ రైతుల (punjab farmers) కోసమా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని ఫాంహౌజ్ (kcr farmhouse) నుంచి ధర్నాచౌక్ దగ్గరకు తీసుకొచ్చామని బండి సంజయ్ గుర్తుచేశారు. 

ALso Read:పంజాబ్ రైతులకు 3 లక్షలు ఇస్తాడట, మరి తెలంగాణలో సంగతేంటీ: కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోయాడు ..? అక్కడ ఏం పనుందని ఆయన ప్రశ్నించారు. వారం రోజుల నుంచి ధాన్యం కొనమని చెబితే కొనలేదని సంజయ్ మండిపడ్డారు. వానాకాలం పంట కొంటావా..? కొనవా అని మొత్తుకున్నామని.. రైతుల గురించి ఆలోచించే పార్టీ బీజేపీ అని బండి సంజయ్ స్పష్టం చేశారు. కానీ టీఆర్ఎస్ (trs) మాత్రం రైస్ మిల్లర్ల గురించే ఆలోచిస్తుందని ఆయన అన్నారు. కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తే మాపై దాడులు చేశారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మాటలకు ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారని.. 40 లక్షల మెట్రిక్ టన్నలు ధాన్యాన్ని కొనేందుకు కేంద్రం ఒప్పుకుందా ..? లేదా చెప్పాలని సంజయ్ ప్రశ్నించారు. 

కొనుగోలు కేంద్రాలకు వడ్లు తేవద్దంటే ఎక్కడ పోసుకోమంటావని కేసీఆర్‌పై ఆయన ఫైరయ్యారు. పోనీ నీ ఫాంహౌస్‌లో పోసుకోమంటావా అంటూ సంజయ్ మండిపడ్డారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణది నాలుగో స్థానమని.. పంజాబ్ రైతులకు మూడు లక్షలు నష్టపరిహారం ఇస్తాడట అంటూ కేసీఆర్‌పై ఫైరయ్యారు. మరి  తెలంగాణలో చనిపోయిన రైతులకు ఇవ్వవా అని సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల చనిపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వరా అని ఆయన నిలదీశారు. 

click me!