వరిపై పోరు: ఢిల్లీకి బయలు దేరిన కేసీఆర్, కేంద్రంతో తాడోపేడో

By narsimha lodeFirst Published Nov 21, 2021, 4:42 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు.  వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిని తేల్చుకొనేందుకు ఆయన ఢిల్లీ బాట పట్టారు.
 


హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. నాలుగు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటారు. తెలంగాణ రాష్ట్రం నుండి వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రంతో తాడోపేడో తేల్చుకొంటానని  ప్రకటించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకొంది.

యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేది లేదని కేంద్రం ఇటీవలనే ప్రకటించింది. అయితే  ఈ వార్త నిజమైందా లేదా అనే విషయాన్ని తెలుసుకొంటానని కేసీఆర్ ప్రకటించారు. ప్రతి ఏటా ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని ప్రకటించాలని కూడా ప్రధానికి kcr లేఖ రాశారు. అయితే ఈ విషయమై కేంద్రం నుండి స్పష్టత రాలేదు.  దీంతో కేంద్ర మంత్రులతో కేసీఆర్ భేటీ కానున్నారు. అవసరమైతే ప్రధాని Narendra modi కలుస్తానని కూడా కేసీఆర్ తేల్చి చెప్పారు. ఇవాళ సాయంత్రం ప్రత్యేక విమానంలో కేసీఆర్ delhi  వెళ్లారు. నాలుగు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలో ఉంటారు.

ALSO READ:పంజాబ్ రైతులకు 3 లక్షలు ఇస్తాడట, మరి తెలంగాణలో సంగతేంటీ: కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

వరి ధాన్యం కొనుగోలు  అశంపై కేంద్రం తీరుపై టీఆర్ఎస్ పోరాటం  చేస్తోంది. ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసింది. ఈ నెల 18న ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నాకు దిగింది టీఆర్ఎస్.  కేంద్రం నుండి రెండు మూడు రోజుల్లో స్పష్టత రాకపోతే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని ఇందిరా పార్క్ వద్ద మహ ధర్నా సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు.

వరి ధాన్యంపై తాడోపేడో తేల్చుకొనేందుకు  కేసీఆర్ ఇవాళ ఢిల్లీకి వెళ్లారు. ధాన్యం కొనుగోలు అంశానికి  సంబంధించి ఎఫ్‌సీఐకి ఆదేశాలు ఇవ్వాలని కూడా కేసీఆర్ ప్రధానిని కోరారు. బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేయబోమని కేంద్రం తేల్చి చెప్పింది. రా రైస్ కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో ఉన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో యాసంగిలో బాయిల్డ్ రైస్ మాత్రమే  ఉత్పత్తి అవుతుందని తెలంగాణ సర్కార్ చెబుతుంది.. కేంద్రం ధాన్యం కొనుగోలుకు సిద్దంగా లేనందునయాసంగిలో వరి పంట వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది.

మరోవైపు వర్షాకాలంలో వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని కేసీఆర్ సర్కార్ పై బీజేపీ రాష్ట్ర నాయకత్వం విమర్శలు చేస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులను ధాన్యం కొనుగోలు గురించి ఆరా తీస్తోంది. ఉమ్మడి నల్గోండ జిల్లాలో బండి సంజయ్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లిన సమయంలో టీఆర్ఎస్ , బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.  బండి సంజయ్ కాన్వాయ్ పై  రాళ్ల దాడి చోటు చేసుకొంది.  పంజాబ్ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణ రాష్ట్రం నుండి రైతుల నుండి ఎందుకు ధాన్యం కొనుగోలు చేయడం లేదని కేంద్రాన్ని కేసీఆర్ సర్కార్ ప్రశ్నించింది.త్వరలోనే  ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈ విషయమై  ప్రస్తావించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఢిల్లీలో  నాలుగు రోజుల టూర్‌లో  కేంద్రంతో తాడో పేడో తేల్చుకొని  హైద్రాబాద్ కు కేసీఆర్ తిరిగి వచ్చే అవకాశం ఉంది.

click me!