
హైదరాబాద్: Telanganaకు ఒక్క Medical collegeని కూడా కేంద్రం మంజూరు చేయలేదన్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుందున్నారు. సోమవారం నాడు Assembly లో తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి Harish Rao ప్రసంగించారు.
కేంద్రం ఇటీవల157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిందన్నారు. అయితే తెలంగాణకు ఒక్క కాలేజీ కూాడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఒక్కో కాలేజీకి రూ. 200 కోట్లు మంజూరు చేసిందని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారరు.
వైద్య, ఆరోగ్య రంగాన్ని ఉమ్మడి పాలకులు నిర్లక్యం చేశారన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 3 మెడికల్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్యను 33కి పెంచుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఉక్రెయిన్ వెళ్లిన మన విద్యార్థుల బాధలు వర్ణనాతీతమన్నారు. గత పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణమని మంత్రి హరీష్ రావు ఆరోపించారు.
health విద్య కోసం భాష రాకపోయినా Ukraine, China తదితర దేశాలకు వెళ్లి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నందు వల్ల విద్యార్థులు ఇక్కడే వైద్య విద్యను చదువుకోవడం సాధ్యం కానుందని చెప్పుకొచ్చారు.
పట్టణాల్లోని పేదల సుస్తీని పోగొడుతూ బస్తీ దవాఖానాలు గొప్పగా సేవలు అందిస్తున్నాయన్నారు. సీఎం KCR ఆలోచనతో దేశంలో మొదటి సారి ఏర్పాటు చేసిన ఈ బస్తీ దవాఖానపై 15వ ఆర్థిక సంఘం ప్రశంసలు కురిపించిందని హరీష్ రావు గుర్తు చేశారు. నగరంలో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ప్రస్తుతం 259 సేవలు అందిస్తున్నాయన్నారు.
బస్తీ దవాఖానల నుండి Tele medicine సేవలు కూడా అందిస్తున్నామన్నారు. గాంధీ, ఉస్మానియా, NIMS వైద్యులు ఈ విధానం ద్వారా అవసరమైన సేవలు అందిస్తున్నారని హరీష్‌రావు తెలిపారు. 57 రకాల పరీక్షలు, ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడం వల్ల పట్టణ పేదలకు ఎంతో ఉపయోగం ఉందన్నారు. అన్ని పట్టణాల్లో 60 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి హరీష్‌రావు ప్రకటించారు.
బస్తీ దవాఖానాల ద్వారా ఇప్పటి వరకు 81 లక్షల మంది ప్రజలకు సేవలు అందించామన్నారు. ఈ దవాఖానాల్లో నెలకు రూ. 75 వేలు ఖర్చు చేస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రతి బస్తీ దవాఖానాలో ఒక డాక్టర్, స్టాఫ్ నర్సు, హెల్పర్ పని చేస్తున్నారన్నారు. . ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దవాఖానాలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయని మంత్రి తెలిపారు. బస్తీ దవాఖానాలకు వస్తున్న రోగుల నుంచి సేకరించిన రక్త నమూనాల పరీక్షలను టీ డయాగ్నోస్టిక్ సెంటర్లలో చేస్తున్నామని తెలిపారు. నిజామాబాద్ పట్టణానికి కూడా బస్తీ దవాఖానాలను మంజూరు చేస్తామన్నారు. వరంగల్ లో కూడా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.