
తెలంగాణలో రేపటి నుంచి (మార్చి 15) ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఈ మేకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఒంటిపూట బడుల్లో భాగంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నట్టుగా విద్యాశాఖ తెలిపింది. 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక, పదో తరగతి పరీక్షలు మే 20వ తేదీ వరకు జరగనున్న నేపత్యంలో.. ఈ విద్యా సంవత్సరానికి అదు చివరి పనిదినం కానుంది.
ఇక, తెలంగాణల అప్పుడే మండిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా పలు జిల్లాలో పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరిగిపోతున్నాయి. దీంతో పాఠశాల విద్యాశాఖ.. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జిల్లా అధికారులు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇక, ఈ ఏడాది మే 20వ తేదీన పాఠశాలల చివరి పని దినం కావడంతో.. మరుసటి రోజు నుంచి వేసవి సెలవులను ప్రకటించనున్నారు. వేసవి సెలవులు పూరైన తర్వాత జూన్ రెండో వారం వరకు వేసవి సెలవులు కొనసాగే అవకాశం ఉంది. కరోనా కారణంగా గతేడాది విద్యా సంవత్సరం పొడగించడంతో.. ఈ సారి కూడా సాధారణం కంటే వేసవి సెలవులు తక్కువగా ఉండే చాన్స్ ఉంది.