
హైదరాబాద్:Telangana ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులకు Hyderabad లో ప్రభుత్వం ఇళ్లు, ప్లాట్లు, అక్రిడిటేషన్ కార్డులు ఇస్తే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ కూడా చేయబోనని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ Jagga Reddy చెప్పారు.అవసరమైతే తాను TRS లో చేరుతానని కూడా ప్రకటించారు
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సోమవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జగ్గారెడ్డికి ఎదురు పడ్డారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య సరదా సంభాషణ జరిగింది. ఈ సంభాషణ సమయంలో వీరి చుట్టూ మీడియా ప్రతినిధులున్నారు. జర్నలిస్టుల కోసం తాను త్యాగం చేయడానికి కూడా సిద్దంగా ఉన్నానని జగ్గారెడ్డి చెప్పారు. ఒక్క దఫా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని కూడా ఆయన తేల్చి చెప్పారు.
కేసీఆర్ ను వ్యతిరేకించి తాను టీఆర్ఎస్ ను వీడలేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ది కోసమే అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో చేరానని జగ్గారెడ్డి తెలిపారు.జగ్గారెడ్డి ఇటీవల కాలంలో ప్రతి రోజూ వార్తల్లో నిలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య సమన్వయం లేకపోవడం, అంతర్గత విబేధాల కారణంగా జగ్గారెడ్డి గత నెల రోజులుగా ప్రతి రోజూ మీడియాలో పతాక శీర్షీకల్లో నిలుస్తున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన Congress పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా జగ్గారెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ Sonia Gandhi తో పాటు Rahul Gandhi కి కూడా ఈ విషయమై లేఖ రాశారు. రేవంత్ రెడ్డి తీరును జగ్గారెడ్డి తప్పు బట్టారు. అయితే ఈ విషయమై పార్టీలో సీనియర్ నేతలు రాజీనామా విషయమై పునరాలోచన చేయాలని కోరారు. దీంతో రాజీనామాపై 15 రోజుల పాటు ఆలోచన చేస్తానని ఆయన ప్రకటించారు. జగ్గారెడ్డితో గత మాసంలోనే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సహా పలువురు నేలు సమావేశమయ్యారు. రాజీనామా చేయవద్దని కోరారు. రేవంత్ రెడ్డి తీరుపై జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జగ్గారెడ్డి రాజీనామా వ్యవహరాన్ని రేవంత్ రెడ్డి టీ కప్పులో తుఫాన్ మాదిరిగా పేర్కొన్నారు. ఈ విషయమై జగ్గారెడ్డి సీరియస్ గా స్పందించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను జగ్గారెడ్డి తప్పు బట్టారు.
ఇదిలా ఉంటే సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో సమావేశం కావాలని జగ్గారెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత వారితో సమావేశం కోసం సమయం ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. జగ్గారెడ్డి తో పాటు మరికొందరు నేతలు కూడా రేవంత్ రెడ్డి తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.పార్టీలో అందరిని రేవంత్ రెడ్డి కలుపుకుపోవడం లేదని వి. హనుమంతరావు విమర్శించారు. ఇదే విషయమై తాను కూడా పార్టీ నాయకత్వానికి కూడా ఫిర్యాదు చేస్తానని వి. హనుమంతరావు చెప్పారు.
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో జగ్గారెడ్డి గత వారంలో సమావేశమయ్యారు. ఇద్దరు సుమారు 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ భేటీ విషయాలను మీడియాకు మాత్రం వెల్లడించలేదు.