మెడపై కత్తిపెట్టినా కేసీఆర్ ‘‘మీటర్లు’’ పెట్టరు.. జగన్ మౌనం ఏంటో : హరీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Feb 16, 2022, 05:46 PM IST
మెడపై కత్తిపెట్టినా కేసీఆర్ ‘‘మీటర్లు’’ పెట్టరు.. జగన్ మౌనం ఏంటో :  హరీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సారాంశం

బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు టీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావు (harish rao). శ్రీకాకుళంలో (srikakulam) బావుల వద్ద 40 కరెంట్ మీటర్లు ఎందుకు పెట్టారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. విద్యుత్ సంస్కరణలపై సీఎం జగన్ (ys jagan) ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. 

బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు టీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావు (harish rao) . శ్రీకాకుళంలో (srikakulam) బావుల వద్ద 40 కరెంట్ మీటర్లు ఎందుకు పెట్టారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి బీజేపీ (bjp) నేతలు సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. విద్యుత్ సంస్కరణలపై సీఎం జగన్ (ys jagan) ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. మెడపై కత్తిపెట్టినా బావుల వద్ద మీటర్లు పెట్టమని కేసీఆర్ తేల్చిచెప్పారని.. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే కేంద్రం రాయితీలు ఇస్తామంటోందని హరీశ్ ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు జాతీయ ప్రాజెక్ట్‌లు ఇచ్చారని.. తెలంగాణకు మాత్రం ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. బీజేపీ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోందని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అతిగతిలేని పార్టీ అన్న ఆయన.. ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి ఓటు వేయకపోతే బుల్డోజర్లతో తొక్కిస్తామంటే, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎందుకు స్పందించలేదని హరీశ్ రావు ప్రశ్నించారు. 

కాగా.. కొన్ని రోజులుగా తెలంగాణలో current meters ల రాజకీయం వేడెక్కింది. ఈ ఇష్యూ మీద కేసీఆర్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలాయి. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది Central Government. ముఖ్యమంత్రి kcr వ్యాఖ్యలపై కేంద్ర Ministry of Power  స్పందించింది. అపోహలు -వాస్తవాలు పేరిట కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ పేరుతో ప్రకటన విడుదల చేసింది. ఇటీవల జనగామ, భువనగిరి లో నిర్వహించిన బహిరంగ సభల్లో కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు సీఎం కేసీఆర్. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా కేంద్రం వ్యవసాయ బోర్లు, బావుల మోటార్ లకు మీటర్లు పెట్టాలని.. మెడపై కత్తి పెట్టిందని ఆరోపించారు.
 
కేంద్రం తెచ్చిన విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే లాండ్రీ లు, పౌల్ట్రీలు, దళితులకు విద్యుత్ రాయితీలు ఇచ్చే అవకాశం ఉండదని చెప్పారాయన. విద్యుత్ సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు మాత్రమే FRMB పరిమితి అరశాతం పెంచారని, దీనివల్ల ఐదేళ్లలో తెలంగాణకు 25 వేల కోట్ల నష్టం జరిగే అవకాశం ఉందని అన్నారు. అయితే, సీఎం కేసీఆర్ ఆరోపణలు కేంద్ర విద్యుత్ శాఖ  ఖండించింది. వ్యవసాయ బోర్లు, బావుల వద్ద మోటార్ లకు విద్యుత్ మీటర్లు పెట్టాలని రాష్ట్రాలను బలవంతం చేయడంలేదని స్పష్టం చేసింది. 

పునరుత్పాదక ఇంధన వినియోగానికి సంబంధించి ఏ రాష్ట్రంపైన ఇప్పటివరకు ఒత్తిడి చేయలేదని తెలిపింది. సౌర విద్యుత్ కొనుగోలుకు రాష్ట్రాలను బలవంతం చేయట్లేదని, విద్యుత్ కొనుగోలు వ్యవహారాలన్నీ  ఓపెన్ బిడ్ ల ద్వారానే జరుగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాలు విద్యుత్ అవసరాలకు అనుగుణంగా కొనుగోలు చేస్తాయని, ఇదంతా బహిరంగంగానే జరుగుతుందని కేంద్రం తెలిపింది. ఇందులో ఎలాంటి దాపరికం లేదని స్పష్టం చేసింది. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అపోహలు, అవాస్తవాలు మాట్లాడటం సరికాదని కామెంట్ చేసింది కేంద్రం. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu