మోకాళ్ల మీద నడిచినా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలవడు: ఈటల రాజేందర్

By narsimha lodeFirst Published Feb 16, 2022, 5:01 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో రాస్ట్రంలో ఓటమి పాలు కానుందని  మాజీ మంత్రి , బీజేపీ నేత ఈటల రాజేందర్ చెప్పారు.

హైదరాబాద్: మోకాళ్ల మీద నడిచినా కూడా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్  విజయం సాధించడని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే Etela Rajender చెప్పారు.

బుధవారం నాడు నాంపల్లిలోని BJP  కార్యాలయంలో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.TRS  ఎమ్మెల్యేలు, మంత్రులుKCR  కు బానిసలుగా మారారని ఆయన విమర్శించారు. సీఎం కేసీఆర్ ఉపయోగించే భాషే తెలంగాణ సంస్కృతి అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు.Huzurabad లో టీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ గంటల తరబడి మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. 

Latest Videos

 తన పని అయిపోయిందని భావించిన  కేసీఆర్  ప్రశాంత్ కిషోర్ సహకారం తీసుకుంటున్నారని అన్నారు. సలహాదారులు కాదు చరిత్ర గతిని మార్చేది ప్రజలేనని కేసీఆర్ మర్చిపోయారని ఈటల విమర్శించారు.. 

తన కుతంత్రాలు,. కుట్రలు, పరిజ్ఞానం సరిపోనందునే కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనతో రాష్ట్రానికి అరిష్టమని తెలంగాణ ప్రజలు స్థిర నిర్ణయానికొచ్చారని ఆయన అన్నారు.ప్రధానమంత్రి Narendra Modiపై కేసీఆర్ ఉపయోగించిన భాషను తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆయన చెప్పారు. 

కేసీఆర్ పై వివేక్ విమర్శలు

ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ ప్రజలను మర్చిపోయారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు vivek venkata Swamyవిమర్శించారు. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోడీ శవయాత్రలకు కేసీఆర్ ఫ్రస్టేషనే కారణమన్నారు.నిజాం ఘగర్ ప్యాక్టరీని రీఓపెన్ చేస్తానని కేసీఆర్ మాట తప్పారన్నారు.. 

వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.. ఆంధ్రా కాంట్రాక్టర్లకు సీఎం కేసీఆర్ ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తీరుతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు.  టీఆర్ఎస్ ప్రభుత్వ దోపిడీతో రాష్ట్రం అప్పుల పాలైందన్నారు.  అవినీతి, కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజలు విసిగిపోయారన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం తీవ్ర స్థాయికి చేరుకొంది. టీఆర్ఎస్ చేసిన విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇస్తోంది. బీజేపీ విమర్శలకు టీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది.ఈ నెల 1వ తేదీన బడ్జెట్ పై కేసీఆర్ స్పందిస్తూ కేంద్రం తీరును తీవ్రంగా తప్పుబట్టారు. బడ్జెట్ పై ఎవరికి కూడా ప్రయోజనం కలగలేదన్నారు. కేసీఆర్ విమర్శలకు బీజేపీ కౌంటరిచ్చింది. బడ్జెట్ పై స్పందించే సమయంలో రాజ్యాంగం మార్చాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ పై బీజేపీ నేతలు ఢిల్లీలో ఆందోళనకు దిగారు. గత వారంలో కూడా కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ తీరును తీవ్రంగా ఎండగట్టారు. 

ఇవాళ బాన్సువాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ బీజేపీ పై తీవ్ర విమర్శలు చేశారు.  సోషల్ మీడియాలో  తెలంగాణపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.. ఉపాధి హామీకి 25 శాతం నిధులు కేంద్రం  తగ్గించిందన్నారు.జివితాలు మార్చమంటే జీవిత భీమాను అమ్మేశారని కేటీఆర్ సెటైర్లు వేశారు.కొందరు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పరోక్షంగా బీజేపీపై ఆయన విమర్శలు చేశారు. తెలంగాణకు ఏం చేశారో చెప్పే దమ్ముందా అని కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  కర్ణాటకలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా తెలంగాణలో ప్రాజెక్టులకు మాత్రం జాతీయ హోదా ఇవ్వలేదని కేటీఆర్ మండిపడ్డారు.యూపీకే ప్రధానిగా మోడీ వ్యవహరిస్తున్నారన్నారు. 

click me!