మంత్రి హరీష్ కు అమెరికాలో భారీ ఫాలోయింగ్

Published : Jul 26, 2017, 06:58 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
మంత్రి హరీష్ కు అమెరికాలో భారీ ఫాలోయింగ్

సారాంశం

మంత్రి హరీష్ రావుకు అమెరికాలో మాంచి ఫాలోయింగ్ ఎఎఫ్ఎంఐ అధ్యక్షుడు ర జియా అమ్మద్ వెల్లడి అమెరికాలో జరిగే సదస్సులోపాల్గొనాలని లేఖ మిషన్ కాకతీయ అధ్బుతంగా ఉందని ఖితాబు

తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుకు అమెరికాలో భారీ ఫాలోయింగ్ ఉందని  ఎఎఫ్ఎంఐ అధ్యక్షుడు రజియా అమ్మద్ తెలిపారు. ఆయన బుధవారం హరీష్ రావుకు ఒక లేఖ రాశారు. 'భారత్ ఎదుర్కుంటున్న సవాళ్ళు, లౌకికవాదం-బహుళత్వం'పై అక్టోబర్ 7న చికాగో లో నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొనవలసిందిగా తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావుకు బుధవారం ఆహ్వనం అందింది. భారతీయ సంతతికి చెందిన ముస్లింల అమెరికా సమాఖ్య(ఏ.ఎఫ్.ఎం.ఐ) ఈ సదస్సు నిర్వహిస్తోంది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించాలని మంత్రి హరీశ్ రావును ఏ.ఎఫ్. ఎం.ఐ.అధ్యక్షుడు రజియ అహ్మద్ తన లేఖలో కోరారు.

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమంతో 17వేల చెరువుల ను పునరుద్ధరించి 5 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు తో పాటు మొత్తం 15 లక్షల ఎకరాలకు మైనర్ ఇరిగేషన్ కింద సాగునీరందించడం చారిత్రాత్మక ఘట్టమని ఆ సంస్థ వ్యాఖ్యానించింది. తెలంగాణ గ్రామీణ సామాజిక, ఆర్ధిక వ్యవస్థలో అనూహ్యమైన మార్పు వచ్చిందని అమెరికా సంస్థ అభిప్రాయపడింది.

మంత్రి హరీశ్ రావును 'విజనరీ'అని పొగిడింది. రైతులు, సామాన్య ప్రజల కోసం నిరంతరం నిబద్ధతతో పనిచేయడం వల్లనే మిషన్ కాకతీయ పేరుతో చెరువులు పునరుద్దరణకు నోచుకోగలిగినట్టు ఏ.ఎఫ్.ఎం.ఐ.పేర్కొంది. "యు.ఎస్.ఏ.లోని పలు రాష్ట్రాల్లో స్థిరపడిన, నివసిస్తున్న తెలంగాణ ప్రజల లో మీకు ఎందరో అభిమానులు ఉన్నారు. మీకు గొప్ప ఫాలోయింగ్ ఉన్నది"అని మంత్రి కి రాసిన లేఖలో ఏ.ఎఫ్.ఎం.ఐ అధ్యక్షుడు పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో: Harish Rao Comments on CP Sajjanar | Asianet News Telugu
Harish Rao Serious Comments: సైబర్ నేరగాళ్లకు రేవంత్ రెడ్డికి తేడా లేదు | Asianet News Telugu