గురుకుల నోటిఫికేషన్లు రద్దు చేసిన టిఎస్పిఎస్సీ

Published : Jul 26, 2017, 04:08 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
గురుకుల నోటిఫికేషన్లు రద్దు చేసిన టిఎస్పిఎస్సీ

సారాంశం

గురుకుల నోటిఫికేషన్లు రద్దు ఫిబ్రవరి 6న విడుదల చేసిన 9 నోటిఫికేషన్లు రద్దు ప్రకటించిన టిఎస్ పిఎస్ సి వారం పది రోజుల్లో కొత్త నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం

 

తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ తాజాగా గురుకుల నోటిఫికేషన్లు రద్ద చేస్తున్నట్లు ప్రకటించింది. గురుకులాల్లో సుమారు 7వేల పోస్టుల భర్తీ కోసం ఫిబ్రవరి 6వ తేదీన 9 నోటిఫికేషన్లు విడుదల చేసింది టిఎస్పిఎస్సీ. కానీ తలా తోక లేకుండా నిబంధనలు ఉండడంతో ఈ నోటిఫికేషన్లు న్యాయస్థానాల్లో నిలువలేకపోయాయి. దీంతో అంతిమంగా నోటిఫికేషన్ల రద్దు ఉత్తమమని సర్వీస్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వేలాది మంది అభ్యర్థులు లబోదిబోమంటున్నారు.

నిబంధనల్లో సవరణలు చేయాల్సి ఉండడంతో నోటిఫికేషన్లు రద్దు చేస్తున్నట్లు టిఎస్సిపఎస్సీ ప్రకటించింది. గురుకుల నియామకాల విషయంలో ఆదినుంచీ వివాదాలు చోటుచేసుకున్నాయి. సిలబస్ తయారీ నుంచి అర్హతల వరకు అన్నింటిలోనూ వివాదాలు చుట్టుముట్టాయి. నోటిఫికేషన్ కూడా కోర్టులో నిలవలేకపోయింది. ఈ నోటిఫికేషన్ లో లింగ వివక్ష చూపారంటూ కొందరు నిరుద్యోగులు హైకోర్టుకు వెళ్లడంతో తాత్కాలిక స్టే ఇచ్చింది హైకోర్టు.

కానీ అనూహ్యంగా కోర్టులో సర్కారు వాదన నిలబడదన్న ఆందోళనతో అంతిమంగా నోటిఫికేషన్ల రద్దుకు నిర్ణయం తీసుకుంది టిఎస్ పిఎస్సీ. ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్ పరీక్ష జరిపింది సర్వీసు కమిషన్. కానీ కొందరు అభ్యర్థులు మెయిన్స్ కూడా రాశారు. కానీ వారందరికీ చేదు వార్తను మిగులుస్తూ కమిషన్ నిర్ణయం తీసుకుంది.

మరో వారం పది  రోజుల్లోనే కొత్త నోటిఫికేషన్ వెలువరించనున్నట్లు కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఈ చర్య ద్వారా మరో తప్పటడుగు వేసిందన్న భావన నిరుద్యోగ వర్గాల్లో నెలకొంది. ఊరించి ఊరించి ఉసూరుమనిపించారని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుని తీరా పరీక్షకు ప్రిపేర్ అయితే చివరి నిమిషంలో రద్దు నిర్ణయం తీసుకోవడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది తెలంగాణ సర్కారు సమిష్టి వైఫల్యం అని వారు విమర్శిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu