ఉద్యోగాల ప్రకటనతో కాంగ్రెస్, బీజేపీల్లో వణుకు: అసెంబ్లీలో హరీష్ రావు

Published : Mar 09, 2022, 04:18 PM IST
ఉద్యోగాల ప్రకటనతో కాంగ్రెస్, బీజేపీల్లో వణుకు: అసెంబ్లీలో హరీష్ రావు

సారాంశం

నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. బడ్జెట్ పై జరిగిన చర్చకు మంత్రి హరీష్ రావు సమాధానం ఇచ్చారు.

హైదరాబాద్:  రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించకుండా గట్టిగా పోరాటం చేయడంతోనే ఎన్జీటీ స్టే ఇచ్చిందని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి Harish Rao చెప్పారు. 

తెలంగాణ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా CLPనేత Mallu Bhatti Vikramarka లేవనెత్తిన అంశాలపై మంత్రి హరీష్ రావు సమాధానమిచ్చారు.

నీటి పారుదల ప్రాజెక్టుల విషయంంలో ప్రజల్లో అనుమానాలు రేకేత్తించేలా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడారని చెప్పారు.  Rayalaseema lift  ఇరిగేషన్ ప్రాజెక్టుపై NGT లో తెలంగాణ తరపున గట్టిగా వాదనలు విన్పించడంతోనే ఎన్జీటీ ఈ ప్రాజెక్టుపై stay ఇచ్చిందని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ నుండి 93.45 టీఎంసీల నీటిని ఇప్పటివరకు తీసుకొన్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు.

80 వేల ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనతో Congress, BJP ల్లో వణుకు మొదలైందన్నారు మంత్రి హరీష్ రావు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల పోస్టుల భర్తీ ఏనాడైనా చేశారా అని ఆయన ప్రశ్నించారు.
బడ్జెట్ పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సూచనలు చేస్తారని తాను అనుకొన్నానన్నారు. రాజకీయ విమర్శలు తప్పా ఎలాంటి సూచనలు చేయలేదని మంత్రి హరీష్ రావు విమర్శించారు. వాస్తవాలు మాట్లాడితే మంచిదని హరీష్ రావు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు సూచించారు.

Rythu bandhu పథకం కింద 69 లక్షల మందికి లబ్ది చేకూర్చిన ప్రభుత్వం తమదన్నారు. రైతు బిడ్డగా కేసీఆర్ ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేశాడన్నారు. కేంద్రం కూడా ఇదే తరహలో పథకాన్ని అమలు చేస్దుందని హరీష్ రావు తెలిపారు. ఈ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేలోపుగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాలు ఎంత మందికి అందించామనే విషయమై వివరాలతో బుక్‌లెట్ ను కూడా అందిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు.

కొత్తగా ఏర్పడిన Telangana రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఆర్‌బీఐ, కేంద్రం ఇచ్చిన గణాంకాలే ఇందుకు నిదర్శనమని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర జీఎస్‌డీపీ 11.54 లక్షల కోట్లకు చేరిందన్నారు.  ప్రజల తలసరి ఆదాయం రూ.2.78 లక్షలకు చేరిన విషయాన్ని మంత్రి తెలిపారు. పలు రంగాల్లో  దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో నిలిచిందన్నారు.

Congress పార్టీ 60 ఏళ్లలో సాధించలేని అభివృద్దిని తాము ఏడేళ్లలో సాధించినట్టుగా మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు.తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలో 7,750 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేదన్నారు. కానీ ఇవాళ 17,800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని మంత్రి హరీష్ రావు వివరించారు.విద్యుత్, మంచినీటి సమస్యలను పరిష్కరించామన్నారు. అంతేకాదు సాగు నీటి సమస్య పరిష్కారం కోసం ప్రాజెక్టులను నిర్మించుకొన్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా