రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీటీసీ దంపతుల మృతి..

Published : Mar 09, 2022, 03:23 PM IST
రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీటీసీ దంపతుల మృతి..

సారాంశం

మంచిర్యాల జిల్లాలో (Mancherial district) జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీటీసీ దంపతులు మృతిచెందారు. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

మంచిర్యాల జిల్లాలో (Mancherial district) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని జన్నారం మండలం (Jannaram mandal) ఇందన్‌పల్లి సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మాజీ ఎంపీటీసీ దంపతులు మృతిచెందారు. మృతులను శోభన దేవి, ఆమె భర్త మురళిధర్ రెడ్డిగా గుర్తించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. 

బుధవారం ఉదయం ఇందన్‌ పల్లిలో ఉన్న హనుమాన్ దేవాలయానికి శోభన దేవి, మురళీధర్ రెడ్డి దంపతులు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. శోభన దేవి మాజీ ఎంపీటీసీగా కాగా, మురళీధర్ మాజీ సర్పంచ్. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా