TS Eamcet -2022: ఈ నెల 14న ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్

Published : Mar 09, 2022, 03:35 PM IST
TS Eamcet -2022:  ఈ నెల 14న ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్

సారాంశం

ఎంసెట్ -2022 ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఈ నెల 14న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ విషయమై ఉన్నత విద్యా మండలి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

హైదరాబాద్: ఎంసెట్-2022 ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఈ నెల 14న నోటిఫికేషన్ వెలువడనుంది.  ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తారు. ఎంసెట్ ప్రవేశ పరీక్షలకు సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యా మండలి సోమవారం నాడు సమీక్ష నిర్వహించింది.ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఉన్నత విద్యా మండలిలో చర్చించినట్టుగా విద్యా మండలి ఛైర్మెన్ Limbadri తెలిపారు.

ఇతర రాష్ట్రాలు నిర్వహించే సెట్‌లు,  JEE పరీక్షల తేదీలను పరిగణనలోకి తీసుకొని TS Eamcet -2022 ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేస్తామని లింబాద్రి వివరించారు.

రాష్ట్రంలో ఎన్ని పరీక్ష కేంద్రాలు, ఎక్కడినుంచి ఎక్కువ మంది విద్యార్ధులు పాల్గొనే అవకాశం ఉందనే అనే అంశాలను టీసీఎస్‌ పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ 2 రోజుల్లో పూర్తయ్యే వీలుందని ఆయన చెప్పారు. 

 అనంతరం ఎంసెట్‌ తేదీలను ఖరారు చేసి, ప్రభుత్వ అనుమతికి పంపుతామని లింబాద్రి తెలిపారు. May నెలలో ఇంటర్మీడియెట్‌ పరీక్షలు పూర్తవుతాయి. అదే నెలలో జేఈఈ Mains  పరీక్షలూ ఉంటాయి. ఇవన్నీ నిర్వహించిన తర్వాత ఎంసెట్‌ సన్నద్ధతకు విద్యార్థులకు కనీసం నెల రోజుల వ్యవధి ఉండాలని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జూన్‌ చివరి వారంలో ఎంసెట్‌ నిర్వహణకు అనుకూలమైనదిగా ఉన్నత విద్యా మండలి అధికారులు నిర్ణయించారు.

ఇక ఎంసెట్‌ పరీక్ష పూర్తయిన నెల రోజుల్లోపు ఎంసెట్‌ Ranks వెల్లడి చేయడానికి సన్నద్ధంచేస్తున్నట్లు తెలిపారు. వాస్తవానికి గతంలో తెలంగాణ ఎంసెట్‌కు ఇంటర్‌ మార్కుల వెయిటేజ్‌ ఉండేది. కానీ, ఈ దఫా  ఇంటర్ మార్కుల వెయిటేజీ ఎంసెట్ కు ఉండదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

ఇంటర్ ఫస్టియర్‌ పరీక్షల్లో కనీస మార్కులతో students ను  ప్రమోట్‌ చేశారు. ఈ మేరకు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఎంసెట్‌ అర్హత మార్కులు 40 శాతం ఉండాలన్న నిబంధనను ఎత్తివేస్తూ సమావేశం నిర్ణయం తీసుకుంది. . జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌ ఫలితాలు, IIT, NEET ప్రవేశాల తేదీలను బట్టి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ను ఖరారు చేయనున్నారు అధికారులు.
 

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా