గ్రామసభలో అందరిముందూ .. మహిళా ఎంపీడీవోపై అసభ్యకర వ్యాఖ్యలు, వివాదంలో ఎర్రబెల్లి

Siva Kodati |  
Published : Jul 09, 2021, 06:35 PM ISTUpdated : Jul 09, 2021, 06:40 PM IST
గ్రామసభలో అందరిముందూ .. మహిళా ఎంపీడీవోపై అసభ్యకర వ్యాఖ్యలు, వివాదంలో ఎర్రబెల్లి

సారాంశం

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివాదంలో చిక్కుకున్నారు. మహిళా ఎంపీడీవోపై ఆయన అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు మంత్రిపై విరుచుకుపడుతున్నారు. 

మహిళా ఎంపీడీవోపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.  గ్రామసభలో అందరి ముందు అవమానపరిచేలా అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్ప‌ల్‌లో నిర్వహించిన గ్రామసభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎర్రబెల్లి కామెంట్స్‌తో ఎంపీడీవో షాక్‌కు గురయ్యారు. చుట్టుపక్కల వున్నవారంతా ఫక్కున నవ్వారు.

Also Read:మొక్కలు కాపాడకుంటే సంక్షేమ పథకాలు కట్: మంత్రి ఎర్రబెల్లి హెచ్చరిక

‘‘ మేడం.. మీరు బాగానే ఊపుతున్నారు.. కానీ ఇక్కడ ఊపడం లేదు. బాగానే చేస్తున్నావు’’ అంటూ ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. దీంతో మంత్రి వెనకాలే వున్న మహిళా ఎంపీడీవోకు ఏం చేయాలో అర్ధం కాక నిర్ఘాంతపోయారు. అందరిముందు మంత్రి అవమాన పరిచేలా కామెంట్స్ చేసినా ఏమి అనలేని పరిస్ధితి. ప్రస్తుతం ఎర్రబెల్లి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహిళా అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

మంత్రి దయాకర్ రావు వ్యాఖ్యలను తెలుగు టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే