ద్రోహం.. చంద్రబాబు, వైఎస్ బాటలోనే జగన్: తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి

By telugu teamFirst Published Jul 9, 2021, 6:09 PM IST
Highlights

కృషా నదీ జలాల వాటాపై  ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. వైఎస్ జగన్ వ్యాఖ్యలు పూర్తిగా అపరిక్వమేనని మంత్రి అన్నారు.

సూర్యాపేట: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటలు ముమ్మాటికీ అపరిక్వమేనని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. వారి మోసాలకు జగన్ మాటలు అద్దం పడుతున్నాయని ఆయన అన్నారు దొంగ ప్రాజెక్టులు కట్టిందే వారని ఆయన అన్నారు. ఇప్పుడు కట్టాలని ప్రయత్నం చేస్తుంది కూడా వారేనని ఆయన అన్నారు. 

లేని హక్కులను ఉన్నట్లు వైఎస్ జగన్ చూపిస్తున్నారని జగదీష్ రెడ్డి అన్నారు మంచినీళ్ల కోసం అలమటించింది వారి హయాంలోనే అని మంత్రి అన్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో తమ వాటాను వదులుకునే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్ర సర్కార్ దుర్మార్గాన్ని ఎండగడుతామని ఆయన అన్నారు. 

 శుక్రవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడారు. మంచినీళ్ళ కోసం అలమటించింది ఆంధ్రోళ్ల పాలనలోనే అని ఆయన విమర్శించారు. చంద్రబాబు నుండి వైఎస్ వరకు తెలంగాణా కు ద్రోహం తలపెట్టిన వారే నని, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడ అదే బాటలోపర్యనిస్తున్నారన్నారు. 

సూర్యాపేట జిల్లా కు ప్రపంచ చిత్రపటంలో చోటు దక్కాలి అన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులలోప్రజలుబాగస్వామ్యం కావడమేనని ఆయన చెప్పారు. పట్టణ ప్రగతిలో భాగంగా శుక్రవారం రోజున సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలోని సద్దులచెర్వు వద్ద నూతనంగా నిర్మిస్తున్న మినీ ట్యాన్క్ బండ తో పాటు జమునానగర్ వైకుంఠ ధామం లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న బర్నింగ్ యూనిట్ తో పాటు డంపింగ్ యార్డ్ లను ఆయన సందర్శించారు. 

అనంతరం29 వ వార్డులో మొక్కలు నాటిన ఆయన పుల్లారెడ్డి చెరువు వద్ద వైకుంఠ దామాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజల పాత్ర కీలకం అని ఆయన తెలిపారు. పట్టణ ప్రగతి,పల్లె ప్రగతిలలో ప్రజల భాగస్వామ్యం కావడం ఆనందదాయకమన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం కూడా అదేనని ఆయన చెప్పారు. పల్లెప్రగతి,పట్టణ ప్రగతిలతో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని అందుకు నిదర్శనం ఊరూరా వెలుస్తున్న ప్రకృతి వనాలేననిఆయాన వెల్లడించారు. యింకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, యం పి పి రవీందర్ రెడ్డి,జడ్ పి టి సి బిక్షం,కౌన్సిలర్లు ఆనంతుల యాదగిరి,రాపర్తి శ్రీను,కక్కరేణి నాగయ్య కమిషనర్ రాముంజుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

click me!