నిరుద్యోగులకు శుభవార్త: తెలంగాణలో 50 వేల ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

By Siva KodatiFirst Published Jul 9, 2021, 6:06 PM IST
Highlights

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో,  ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. నూతన జోన్ల విధానానికి అడ్డంకులు తొలగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను రెండో దశలో భర్తీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ అస్తవ్యస్తంగా వుండేదన్నారు. స్థానికులకు న్యాయం కోసం కొత్త జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. జోన్ల వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదంతో అడ్డంకులు తొలగిపోయాయని కేసీఆర్ వెల్లడించారు. ఖాళీల సమాచారాన్ని అధికారులు కేబినెట్‌‌కు అందజేయాల్సిందిగా సీఎం ఆదేశించారు. 

Also Read:తెలంగాణ వచ్చినా కొత్త ఉద్యోగాలు రాలేదు: టీఆర్ఎస్‌పై ఈటల జమున ఫైర్

ఎంతో శ్రమతో అత్యంత శాస్త్రీయ విధానాన్ని అనుసరించి రూపొందించిన జోనల్ వ్యవస్థకు కేంద్రం అమోదం లభించడంలో ఇన్నాళ్లు జాప్యం జరిగిందని కేసీఆర్ తెలిపారు. నేరుగా నింపే అవకాశాలున్న (డైరెక్టు రిక్రూట్ మెంట్) అన్ని రకాల ఉద్యోగాలు దాదాపు 50 వేల దాకా ఖాళీగా ఉన్నాయి. వాటిని ముందుగా భర్తీ చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే అన్నిశాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని..  ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడిన ఉద్యోగ ఖాళీలను  కూడా గుర్తించి భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. 

click me!