
అమర వీరుల స్పూర్తి యాత్ర నాల్గవ దశ శుక్రవారం నుండి ప్రారంభం కానుంది. నిజామాబాద్ జిల్లాలోని ఎంపి కల్వకుంట్ల కవిత పార్లమెంటు నియోజకవర్గంలోనే సింహభాగం నాలుగో దశ స్పూర్తి యాత్రకు జెఎసి రూకల్పన చేసింది. ఈ యాత్రను రెండు రోజులపాటు జరపనున్నారు జెఎసి నేతలు.
హైదరాబాద్ లోని గన్ పార్కు వద్ద అమర వీరుల స్తూపానికి జెఎసి ఛైర్మన్ కోదండరాం నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లాలోని బస్వాపుర్ వెళ్తారు. అక్కడే యాత్ర షురూ అవుతుంది. బస్వాపూర్ లో ప్రారంభం అయి 12 న నిజామబాద్ వరకు సాగి నిజామాబాద్ లోనే బహిరంగ సభతో నాల్గవ దశ యాత్ర ముగియనుంది.
తెలంగాణ ఏర్పాటు కు ముఖ్య కారకులు అమరవీరులే, అ అమరవీరుల కుటుంబాలకు ఏలాంటి గౌరవం, న్యాయం దక్కడం లేదని జెఎసి ఆరోపిస్తున్నది. తెలంగాణల ముఖ్య ఉద్దేశాలు నీళ్లు, నిధులు, నియామకాలు. అయితే తెలంగాణ ఏర్పడి ముడున్నర ఏండ్లు కావస్తున్నా ట్యాగ్ లైన్స్ అమలుకు నోచుకోవడంలేదని జెఎసి వాదన. ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో బీడు భూములు సాగు భూములుగా మారాల్సిన లక్ష్యం పాలకులు మరచిపోయారని జెఎసి అంటున్నది. అది గాలికే వదిలేసి రిడిజైనింగ్ పేరుతో కాలయాపన చేస్తున్నరని జెఎసి ఆగ్రహం వ్యక్తం చేస్తన్నది. రాష్ట్రంలో ముఖ్యంగా యవత నిరుద్యోగ సమస్యతో సతమత మవుతున్నారని, టీఅర్ ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక్క దెబ్బలో లక్ష ఉద్యోగాలు అని మాట ఇచ్చినా ఆచరణలో ఫెయిల్ అయిందని జెఎసి చెబుతున్నది.
ఉద్యోగాల జాడలేక పోగా ఇక నిధుల ముచ్చట అయితే తిరుపతి వెంకన్న హుండిలో పడునట్టే ఉందని జెఎసి నేతలు ఆరోపిస్తున్నారు.
నిరుద్యోగుల సంగతి ఒక్క సారి పక్కన పెడితే, కనీసం అమరవీరుల కుటుంబలకు ఉద్యోగం ఇచ్చే ఉసే లేకపాయే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమరుల కుటుంబాలను ఎదోరకంగా ఆదుకునే ప్రయత్నం కూడ చేయడం లేదు అని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు.
గడిచిన మూడు దశల స్పూర్తి యాత్ర లో ప్రజల నుండి స్పందన బాగా ఉంది, ప్రజానికం ఈ ప్రభుత్వంపై పూర్తిగా అసంతృప్తి ఉందన్నారు కోదండరరాం.
గ్రామాలలో ప్రజల తో మాట్లాడునప్పుడు వారి భాద వర్ణాతితం అని, రైతులు, భూనిర్వాసితులు మాత్రం తెలంగాణ ఏర్పడ్డాక చాలా నష్ట పోయారు అని తెలిపారు కోదండరాం.
గత మూడు యాత్ర లలో ప్రజలు, ప్రజాసంఘాలు, నిరుద్యోగులు యాత్రకు సహకరించారు, అదే విధంగా నాల్గవ దశ అమరవీరుల స్పూర్తి యాత్రకు మీరు తోడ్పడుతారని ఆశిస్తున్నట్లు వివరించారు కోదండరాం.
అమరవీరుల త్యాగాలు వృధా కానివ్వం అని, వారి ఆశయాల సాదనకు కృషిచేస్తాం అని తెలిపారు కోదండరాం.
మరి నాలుగో విడత స్పూర్తి యాత్ర ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.