మేడిగడ్డపై అధికారులకు ఉచ్చు: 12 చోట్ల ఏకకాలంలో విజిలెన్స్ సోదాలు

By narsimha lode  |  First Published Jan 9, 2024, 2:25 PM IST


మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుపై విజిలెన్స్ విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే  రాష్ట్రంలోని  12 చోట్ల  అధికారులు సోదాలు చేస్తున్నారు.



హైదరాబాద్:  మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగుబాటుపై  కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో  మంగళవారంనాడు  విజిలెన్స్ అధికారులు  హైద్రాబాద్ ఎర్రమంజిల్ లోని  నీటిపారుదల శాఖ కార్యాలయంలో  విచారణ ప్రారంభించారు. 

హైద్రాబాద్ లోని  నీటిపారుదల శాఖలోని రెండు, నాలుగు అంతస్తుల్లోని  కార్యాలయాల్లో విచారణ చేస్తున్నారు. అదే విధంగా రాష్ట్రంలోని  12  ప్రాంతాల్లో కూడ నీటిపారుదల శాఖాధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నిర్వహించిన  ప్రాంతాల్లో  విజిలెన్స్ అధికారులు  సోదాలు నిర్వహిస్తున్నారు.  ఇటీవలనే  ఇరిగేషన్ కార్యాలయంలో  కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు మాయమైన విషయం తెలిసిందే. దీంతో  విజిలెన్స్  విచారణకు  రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 12 చోట్ల ఇరిగేషన్ కార్యాలయాల్లో  ఏక కాలంలో  విచారణ నిర్వహిస్తున్నారు. 

Latest Videos

undefined

also read:బీఆర్‌ఎస్‌కు కాళేశ్వరం కష్టాలు: మేడిగడ్డ ముంచుతుందా, తేల్చుతుందా?

మేడిగడ్డ బ్యారేజీకి చెందిన పిల్లర్ల కుంగుబాటుపై జ్యుడీషీయల్ విచారణ చేపడుతామని  ముఖ్యమంత్రి  అనుముల రేవంత్ రెడ్డి శాసనమండలిలో ప్రకటించారు.  జ్యుడిషీయల్ విచారణకు  సంబంధించిన ప్రక్రియ కూడ త్వరలో ప్రారంభంకానుంది.

also read:మేడిగడ్డ బ్యారేజీ: బీఆర్ఎస్‌ను చక్రబంధంలోకి నెడుతున్న కాంగ్రెస్

మేడిగడ్డ బ్యారేజీకి చెందిన  బీ బ్లాక్ లోని  19, 20, 21 పిల్లర్లు 2023 అక్టోబర్  21వ తేదీన కుంగుబాటుకు గురయ్యాయి. ఈ పిల్లర్ల కుంగుబాటుకు  విద్రోహశక్తుల ప్రమేయం ఉందా అనే అనుమానంతో  ఇరిగేషన్ ఏపీ రవికాంత్  మహదేవ్ పూర్ పోలీసులకు  2023 అక్టోబర్  24న ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లర్ల కుంగుబాటుపై విద్రోహశక్తుల ప్రమేయం లేదని ఎస్పీ కిరణ్ ఖరే అప్పట్లోనే తేల్చి చెప్పారు.

also read:కుంగిన మేడిగడ్డ బ్యారేజీ: పరిశీలించిన రాహుల్ గాంధీ

2023 డిసెంబర్  17, 18 తేదీల్లో  నీటి పారుదల శాఖాధికారులు, ఎల్ అండ్ టీ  సంస్థతో  నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.  మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో నాసిరకం పనుల చేయడంపై  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుపై  విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది. విజిలెన్స్  విచారణలో తేలిన వాస్తవాల ఆధారంగా  చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది.  జ్యుడిషీయల్ విచారణకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించేందుకు  ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.ఈ విషయమై ప్రభుత్వం తీసుకోనుంది.  తెలంగాణ నీటిపారుదల శాఖ  ఇంజనీర్ ఇన్ చీఫ్ గా ఉన్న  మురళీధర్ రావును తప్పించాలని  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ  జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.మురళీధర్ రావును తప్పించి ఆయన స్థానంలో  మరొకరిని నియమించాలని  ఆయన కోరారు. 

మేడిగడ్డలో ఇటీలవలనే మంత్రుల బృందం పర్యటించింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీ  కుంగుబాటుకు గల కారణాలపై  ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్  పై మంత్రులు ప్రశ్నల వర్షం  కురిపించారు. 
 

click me!