రంగారెడ్డి జిల్లాలో యువతిని పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు..

Published : Jan 09, 2024, 11:51 AM IST
రంగారెడ్డి జిల్లాలో యువతిని పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు..

సారాంశం

మెయిన్ రోడ్డుకు అతి దగ్గరగా ఉన్న బాట వెంట యువతిని దహనం చేశారు. అది కూడా సమీపంలో పొలాల్లో రైతులు పనిచేస్తుంటారు. వారు మధ్యాహ్నం భోజనాలకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. 

రంగారెడ్డి జిల్లా : తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. రంగారెడ్డిజిల్లా మెయినాబాద్ మండలం బంటారంలో ఓ యువతిని పెట్రోల్ పోసి తగలబెట్టారు కొంతమంది దుండగులు. ఈ విషయం వెలుగు చూడడంతో స్థానికంగా తీవ్ర కలకలం నెలకొంది. సోమవారం సమీపపొలాల్లో పనిచేసుకుంటున్న రైతులకు దగ్గర్లోని బాటనుంచి మంటలు రావడం కనిపించింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు వచ్చేవరకు ఆ యువతి కాలుతూనే ఉంది. పోలీసులు వచ్చి మంటలు ఆర్పేసరికి 90 శాతం దహనం అయిపోయింది. క్లూలు దొరకడం కష్టంగా మారింది. యువతికి 25 సంవత్సరాలలోపు వయసు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎక్కడో చంపి, ఇక్కడికి తీసుకువచ్చి దహనం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. యువతిని సజీవ దహనం కాదని..సీన్ చూసిన వారు చెబుతున్నారు.

మెయిన్ రోడ్డుకు అతి దగ్గరగా ఉన్న బాట వెంట యువతిని దహనం చేశారు. అది కూడా సమీపంలో పొలాల్లో రైతులు పనిచేస్తుంటారు. వారు మధ్యాహ్నం భోజనాలకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. అంటే ఈ దారి గురించి బాగా తెలిసినవారు.. రైతుల ఏ సమయాల్లో పొలాల్లో ఉండరో తెలిసినవారే ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. 

పంజాగుట్ట కారు ప్రమాదం: హైకోర్టును ఆశ్రయించిన సాహిల్

యువతిని దహనం చేసిన ప్రాంతానికి సమీపంలోనే ఓ రిసార్ట్ కూడా ఉంది. ఈ బాట వెంట శంకర్ పల్లికి చెందిన యువకులు ఎక్కువగా వెడుతుంటారని వారి పని అయి ఉంటుందని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యువతి ఎవరనేది తెలియడం లేదు. యువతిని దహనం చేసిన ప్రాంతంలో ఓ మొబైల్ దొరికింది. అయితే ఆ మొబైల్ లో సిమ్ లేకపోవడంతో కావాలనే సిమ్ తీసి మొబైల్ అక్కడ పడేశారని, యువతి గురించిన వివరాలు తెలియకూడదనే చేశారని అంటున్నారు.

యువతిని సజీవ దహనం చేస్తే.. మంటలకు అటూ, ఇటూ కదులుతుంది కాబట్టి బూడిద చెల్లా చెదురవుతుందని.. ఘటనా స్థలంలో బూడిద ఒక దగ్గరే ఉండడాన్ని బట్టి ఎక్కడో చంపి, ఇక్కడికి తెచ్చి దహనం చేసి ఉంటారని క్లూస్ టీం అభిప్రాయ పడుతోంది. దుండగులు కొత్తవాళ్లు అయితే, ఆ దారిగుండా మరింత లోపలికి.. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లేవారని.. ఈ దారి గురించి పూర్తిగా తెలిసినవారు కాబట్టే ఇక్కడ కాల్చడానికి సాహసించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిమీద దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Revanth Reddy Powerful Speech: కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు శ్రీకారం | Asianet Telugu
దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ! | Hyderabad Old City House Theft | Thief Sleeping In House