బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. రఘనందన్ రావుపై వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరుతూ అసెంబ్లీ స్పీకర్‌కు ఐపీఎస్‌ల సంఘం ఫిర్యాదు చేసింది.
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చిక్కుల్లోపడ్డారు. ఆయనపై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీపీ అంజనీకుమార్‌ను ఉద్దేశిస్తూ రఘునందన్ రావు పరుష పదజాలం ఉపయోగించారని సంఘ సభ్యులు సీరియస్ అయ్యారు. రఘనందన్ రావుపై వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరుతూ అసెంబ్లీ స్పీకర్‌కు ఐపీఎస్‌ల సంఘం ఫిర్యాదు చేసింది. పోలీస్ వ్యవస్థ నైతిక స్థైర్యం దెబ్బతినేలా రఘునందన్ రావు వ్యాఖ్యానించారని సంఘ సభ్యులు ఎద్దేవా చేశారు.
కాగా.. టెన్త్ పేపర్ లీక్‌కు సంబంధించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని నిన్న రాత్రి కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న రఘునందన్ రావు బొమ్మలరామారం పీఎస్‌కి చేరుకున్నారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డుకుని, బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. రాష్ట్రంలో బీహార్ రాజ్యాంగాన్ని డీజీపీ అమలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
ALso Read: అరెస్ట్ సమయంలో నా భర్తకు గాయాలు...: బండి సంజయ్ భార్య అపర్ణ ఆందోళన
ఇదిలావుండగా.. తెలంగాణ పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజ్ కేసుకు సంబంధించి టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. బండి సంజయ్‌ను ఈ కేసులో నిందితుల జాబితాలో చేర్చారు. ఆయనపై ఐపీసీ సెక్షన్ 420, సెక్షన్ 6 ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశారు. అలాగే ఈ కేసులో నిందితునిగా ప్రశాంత్.. బండి సంజయ్‌ల మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ను పోలీసులు రిట్రీవ్ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రశాంత్ నుంచి బండి సంజయ్‌కు పెద్ద ఎత్తున కాల్స్ వెళ్లినట్టుగా కూడా తెలుస్తోంది. పేపర్ లీక్ జరగడానికి ముందు రోజు బండి సంజయ్‌తో ప్రశాంత్ ఫోన్‌లో మాట్లాడినట్టుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అలాగే మంగళవారం రోజున బండి సంజయ్‌ను పేపర్ పంపిన తర్వాత కూడా ప్రశాంత్ ఆయనతో మాట్లాడినట్టుగా గుర్తించారు.