బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ పై దాఖలైన పిటిషన్ పై రేపు తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించనుంది.
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ పై రేపు ఉదయం విచారించనున్నట్టుగా తెలంగాణ హైకోర్టు తెలిపింది. మంగళవారంనాడు రాత్రి కరీంనగర్ లో బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి కరీంనగర్ నుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో ని బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయమై ఇవాళ తెలంగాణ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ను బీజేపీ దాఖలు చేసింది. బీజేపీ నేత సురేందర్ రెడ్డి ఈ పిటిషన్ ను ఇవాళ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు స్వీకరించింది. రేపు విచారించనున్నట్టుగా తెలంగాణ హైకోర్టు తెలిపింది.
బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ నేత సురేందర్ రెడ్డి బుధవారంనాడు తెలంగాణ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది.
టెన్త్ క్లాస్ పేపర్ ను ప్రశాంత్ వాట్సాప్ లో బండి సంజయ్ కు షేర్ చేశారు. ఈ విషయంలో కుట్ర జరిగిందని బీఆర్ఎస్ ఆరోపించింది. పేపర్ ను వాట్సాప్ లో షేర్ చేయడం వెనుక బీజేపీ నేతల కుట్ర ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. బీజేపీ నేతలతో ప్రశాంత్ ఫోన్ లో మాట్లాడిన విషయాలను బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ కేసులో బండి సంజయ్ ను నిన్న రాత్రి కరీంనగర్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ నుండి బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. బోమ్మలరామారం పోలీస్ స్టేషన్ నుండి బండి సంజయ్ ను ఇవాళ మధ్యాహ్నం వరంగల్ జిల్లాకు తరలించారు.
also read:బండి సంజయ్ అరెస్ట్: పార్లమెంట్ ఆవరణలో బీజేపీ ఎంపీల నిరసన
టెన్త్ క్లాస్ పరీక్షలు ప్రారంభమైన తర్వాత వరుసగా తాండూరు , వరంగల్ లలో ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే వాట్సాప్ లలో పేపర్లు బయటకు వచ్చాయి. ఈ విషయమై బీజేపీ నేతలు కుట్ర పన్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.