ఈ సారి కాస్త ముందుగానే ఇంటర్ పరీక్షలు.. కారణాలేంటంటే ?

By Asianet News  |  First Published Dec 9, 2023, 8:07 AM IST

telangana inter exams 2023 : దాదాపుగా ప్రతీ ఏడాది మార్చి మధ్యలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారు. కానీ ఈ సారి కాస్త ముందుగానే పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు వస్తుండటం, ఇంటర్ తరువాతే పదో తరగతి పరీక్షలు నిర్వహించాల్సి రావడంతో పాటు పలు కారణాల వల్ల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 


telangana inter exams 2023 : తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది కాస్త ముందుగానే ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. అయితే కొత్త ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. మంత్రి ఆమోదం అనంతరం ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించనున్నారు.

నేడు కొలువుదీరనున్న తెలంగాణ కొత్త అసెంబ్లీ.. ప్రమాణ స్వీకారం చేయనున్న ఎమ్మెల్యేలు..

Latest Videos

కారణాలు ఇవే..
ఈ ఏడాది ఏప్రిల్ తరువాత పార్లమెంట్ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. దీంతో పరీక్షల నిర్వహణకు, ఆన్సర్ షీట్ల వ్యాలుయేషన్స్ కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య జేఈఈ మెయిన్స్ పరీక్షలు కూడా ఉన్నాయి. దీంతో ముందుగా ఇంటర్ పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఆ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు సమయం ఉంటుంది. దీంతో పాటు ఇంటర్ పరీక్షలు ముగిసిన అనంతరమే టెన్త్ క్లాస్ పరీక్షలు జరపాల్సి ఉంటుంది. ఈ కారణాల నేపథ్యంలో ఈ సారి మార్చి 1వ తేదీ నుంచే పరీక్షలు మొదలుపెట్టాలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

ISRO : సూర్యుడిపై తొలి ఫోటోలు బంధించిన ‘‘ Aditya-L1 ’’.. సరికొత్త శకానికి నాంది అంటోన్న శాస్త్రవేత్తలు

పదో తరగతి పరీక్షలు ఎప్పుడంటే ? 
ఇంటర్ పరీక్షలు ముగిసిన వెంటనే పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని విద్యా శాఖ అధికారులు భావిస్తున్నారు. మార్చి 12వ తేదీ లేకపోతే 14వ తేదీన ఈ పరీక్షలు మొదలుపెట్టాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా గెలుస్తోంది. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇవి మార్చి 9వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది. 

click me!