Hyderabad: తెలంగాణలో మే 15 నుంచి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ప్రారంభంతో పాటు జూన్ 1 నుంచి తరగతులు మొదలు కానున్నాయి. ఒరిజినల్ ఎస్ఎస్సీ పాస్ సర్టిఫికెట్, స్కూల్ యాజమాన్యం జారీ చేసిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుందని బోర్డు అధికారులు తెలిపారు.
Telangana State Board of Intermediate Education: తెలంగాణలో మే 15 నుంచి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ప్రారంభంతో పాటు జూన్ 1 నుంచి తరగతులు మొదలు కానున్నాయి. ఒరిజినల్ ఎస్ఎస్సీ పాస్ సర్టిఫికెట్, స్కూల్ యాజమాన్యం జారీ చేసిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుందని బోర్డు అధికారులు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. ఇటీవల ఇంటర్ ఫలితాలు ప్రకటించిన తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి అకాడమిక్ ప్రారంభం వివరాలు వెల్లడించింది. రాష్ట్రంలోని వివిధ ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ మే 15న ప్రారంభం కానుండగా, జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపింది. జూన్ 30లోగా అడ్మిషన్లు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంటర్ నెట్ మార్కుల మెమోల ఆధారంగా తాత్కాలిక అడ్మిషన్లు చేపట్టాలని అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లను బోర్డు ఆదేశించింది. ఒరిజినల్ ఎస్ఎస్సీ పాస్ సర్టిఫికేట్, స్కూల్ అధికారులు జారీ చేసిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుందని బోర్డు అధికారులు తెలిపారు. 2023-24 విద్యాసంవత్సరానికి బోర్డు మంజూరు చేసిన సెక్షన్ల సంఖ్య, అడ్మిషన్ల కాలంలో ప్రతి విభాగంలో ఎన్ని సీట్లు, ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో ప్రముఖంగా ప్రదర్శించాలని విద్యాసంస్థల యాజమాన్యాన్ని కోరింది. అంతేకాకుండా కాలేజీలు ప్రతిరోజూ సమాచారాన్ని అప్డేట్ చేయాలని పేర్కొంది.