రేపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

Published : Jun 17, 2020, 02:28 PM ISTUpdated : Jun 17, 2020, 02:50 PM IST
రేపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

సారాంశం

వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తారని అంతా భావించారు. అయితే.. వైరస్ ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోవడంతో.. అసలు పరీక్షలను పూర్తిగా రద్దు చేశారు.

తెలంగాణలో గురువారం ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంటర్ పరీక్ష ఫలితాల ప్రక్రియను ఇప్పటికే ఇంటర్ బోర్డు పూర్తి చేసింది. పరీక్షా ఫలితాలపై ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించింది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు గురువారం సాయంత్రం 4గంటలకు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల చేయనున్నారు.

కాగా.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇదిలా ఉండగా.. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తారని అంతా భావించారు. అయితే.. వైరస్ ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోవడంతో.. అసలు పరీక్షలను పూర్తిగా రద్దు చేశారు.

పరీక్షలు లేకుండానే వారిని ప్రమోట్ చేశారు. ఇతర తరగతులను కూడా ఈ సంవత్సరం ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్ చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.