రేపు సూర్యాపేటలో కల్నల్ సంతోష్ అంత్యక్రియలు

By narsimha lodeFirst Published Jun 17, 2020, 12:30 PM IST
Highlights

భారత్, చైనా సరిహద్దు లడ్డాఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు సూర్యాపేటలో గురువారం నాడు నిర్వహించనున్నారు.


సూర్యాపేట: భారత్, చైనా సరిహద్దు లడ్డాఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు సూర్యాపేటలో గురువారం నాడు నిర్వహించనున్నారు. సూర్యాపేటలోని హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకొన్న సంతోష్ బాబు కుటుంబసభ్యులు బుధవారం నాడు ఉదయం చేరుకొన్నారు. సంతోష్ భార్య సంతోషితో పాటు పిల్లలను సైబరాబాద్ సీపీ సజ్జనార్, డీసీపీ ప్రకాష్ రెడ్డిలు విమానాశ్రయానికి వచ్చారు. సంతోష్ బార్యతో పాటు అతని తల్లిదండ్రులను ప్రత్యేక వాహనంలో నానల్ నగర్ ఆర్మీ గెస్ట్ హౌస్ కు తరలించారు.

also read:సూర్యాపేటలోనే కల్నల్ సంతోష్ కుమార్ అంత్యక్రియలు

సంతోష్ భార్య ఎయిర్ పోర్టు నుండి వెళ్లే సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. ఈ దృశ్యాలు పలువురిని కంటతడిపెట్టించాయి. సంతోష్ బాబు పార్థీవదేహం ఇవాళ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకొంటుంది. ఈ విమానాశ్రయం నుండి ప్రత్యేక వాహనంలో మృతదేహాన్ని సూర్యాపేటకు తరలిస్తారు.

సూర్యాపేటలోని సంతోష్ బాబు ఇంటి వద్ద ప్రత్యేక చర్యలు తీసుకొన్నారు. కరోనా నేపథ్యంలో సంతోష్ బాబు ఇంట్లోకి ఆర్మీ అధికారులు ఎవరిని కూడ అనుమతించడం లేదు. 

సంతోష్ బాబుకు కడసారి వీడ్కోలు పలికేందుకు వచ్చే వారి కోసం ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నారు. కరోనాను పురస్కరించుకొని భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకొంటున్నారు.
 

click me!