ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు: తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే

By narsimha lode  |  First Published Jun 17, 2020, 1:34 PM IST

 తెలంగాణలో ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించడంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు బుధవారంనాడు స్టే ఇచ్చింది.కరోనాతో మరణించినవారికి పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.



హైదరాబాద్: తెలంగాణలో ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించడంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు బుధవారంనాడు స్టే ఇచ్చింది.కరోనాతో మరణించినవారికి పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును  ఆశ్రయించింది.

ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది. కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్ ఆదేశాలకు అనుగుణంగానే తాము పరీక్షలు నిర్వహిస్తున్నామని సుప్రీంకోర్టుకు తెలిపింది తెలంగాణ ప్రభుత్వం.

Latest Videos

undefined

also read:చేయాల్సిందే: కరోనా పరీక్షలపై కేసీఆర్ సర్కార్‌కి హైకోర్టు షాక్

ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ విషయమై ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు హైకోర్టు ఆదేశాలపై స్టే మంజూరు చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

తెలంగాణలో కరోనా పరీక్షల నిర్వహణపై ప్రోఫెసర్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ పై ఈ ఏడాది మే 14వ తేదీన హైకోర్టు ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై మరో రెండు వారాల తర్వాత మరోసారి సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. 

click me!