జూన్ 3న తెలంగాణ ఇంటర్ పరీక్షలు... ప్రకటించిన ఇంటర్‌బోర్డ్

By Siva KodatiFirst Published May 13, 2020, 9:19 PM IST
Highlights

కరోనాను నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు గాను లాక్‌డౌన్ అమల్లో రావడంతో తెలంగాణలో వాయిదా పడిన ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు సిద్ధమయ్యింది

కరోనాను నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు గాను లాక్‌డౌన్ అమల్లో రావడంతో తెలంగాణలో వాయిదా పడిన ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు సిద్ధమయ్యింది. ఈ మేరకు బుధవారం వాయిదా పడిన పరీక్షల తేదీలను ప్రకటించింది.

జూన్ 3న ఇంటర్ రెండో సంవత్సరం జాగ్రఫీ, మోడరన్ లాంగ్వేజ్ పరీక్షలు జరుగుతాయని తెలంగాణ ఇంటర్ బోర్డ్ కార్యదర్శి జలీల్ ఓ ప్రకటనలో తెలిపారు. పాత హాల్ టికెట్ల నంబర్లతో గతంలో కేటాయించిన కేంద్రాల్లోనే పరీక్షలు జరుగుతాయని చెప్పారు.

Also Read:తెలంగాణలో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం

3వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వాస్తవంగా మార్చి 23న జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఈ రెండు పరీక్షలు వాయిదా పడ్డాయి. 

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం మంగళవారంనాడు ప్రారంభమైంది. లాక్ డౌన్ నేపథ్యంలో జవాబు పత్రాల మూల్యాంకనం నిలిచిపోయిన విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 5వ తేదీన నిర్వహించారు.ఈ సమావేశంలో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం, టెన్త్ పరీక్షల నిర్వహణ విషయమై చర్చించింది.

Also Read:విద్యార్ధులకు భరోసా.. జూన్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు: సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఇటీవల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంటర్ జవాబు పత్రాల వాల్యూయేషన్ చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. టెన్త్ పరీక్షల విషయంలో  హైకోర్టు నిర్ణయం ప్రకారం నడుచుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

హైద్రాబాద్ మహబూబియా కాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఇంటర్ జవాబు పత్రాల వాల్యూయేషన్ ఇవాళ ప్రారంభమైంది. ఇంటర్ రెండో సంవత్సరం జవాబు పత్రాలను దిద్దనున్నారు. ఆ తర్వాత ఇంటర్ ప్రథమ సంవత్సరం జవాబు పత్రాల వాల్యూయేషన్ చేయనున్నారు.

click me!