కేసీఆర్ గారు... హైదరాబాద్‌లో కేసులు ఎందుకు పెరుగుతున్నాయి: రాములమ్మ ఫైర్

Siva Kodati |  
Published : May 13, 2020, 07:05 PM ISTUpdated : May 13, 2020, 07:08 PM IST
కేసీఆర్ గారు... హైదరాబాద్‌లో కేసులు ఎందుకు పెరుగుతున్నాయి: రాములమ్మ ఫైర్

సారాంశం

హైదరాబాద్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో సినీ నటి, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి స్పందించారు

హైదరాబాద్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో సినీ నటి, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి స్పందించారు. ప్రజలు నిజాయితీగా 50 రోజులు లాక్‌డౌన్ పాటించారని, అయినా కేసులు పెరగడం ఏంటని రాములమ్మ ప్రశ్నించారు.

Also Read:ఒకరి నుంచి మరొకరికి... 90కుటుంబాలకు కరోనా

సిటీలో కోవిడ్ 19 కేసులు పెరిగేందుకు మద్యం షాపులు తెరవడమే కారణమైతే, వెంటనే వాటిని మూసేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు తక్కువగా ఉన్న కేసులు మళ్లీ పెరుగుతున్నాయి కాబట్టి సరైన సంఖ్యలో పరీక్షలు నిర్వహించలేదేమో అని విజయశాంతి అనుమానం వ్యక్తం చేశారు.

ఒకవేళ సరైన విధంగా పరీక్షలు చేయకపోయి ఉంటే, ఆ నిజం ఒప్పుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అన్ని త్యాగాలు చేసిన ప్రజలు అసలు సమస్య అర్ధం కాక సతమతమవుతున్నారని రాములమ్మ అన్నారు.

Also Read:తెలంగాణలో కొత్తగా 51 కేసులు, ఇద్దరి మృతి: 1,326కి చేరిన సంఖ్య

ముఖ్యమంత్రి దొరగారు తమ తప్పిదాలను ప్రజల అలవాటు మీదకు నెట్టే ప్రయత్నమేదో చేస్తున్నట్లు విజయశాంతి ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆమె ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు తెలంగాణలో మంగళవారం 51 కేసులు నమోదవ్వడంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,326కి చేరుకుంది. 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే