సాత్విక్ సూసైడ్ ఎఫెక్ట్: నార్సింగి శ్రీచైతన్య కాలేజీ అనుమతి రద్దు

By narsimha lode  |  First Published Mar 6, 2023, 9:14 PM IST

రంగారెడ్డి  జిల్లా నార్సింగి  శ్రీ చైతన్య  కాలేజీ  బ్రాంచ్  పై  ఇంటర్ బోర్డు  అధికారులు  చర్యలు తీసుకుంటున్నారు.   సాత్విక్  ఆత్మహత్యతో  ఇంటర్ బోర్డు అధికారులు  నిర్ణయాలు తీసుకుంటున్నారు. 


హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా   నార్సింగి  శ్రీ చైతన్య కాలేజీ బ్రాంచ్ కు  ఇంటర్ బోర్డు  అధికారులు సోమవారం నాడు నోటీసులు జారీ చేశారు.  వచ్చే ఏడాది ఈ కాలేజీకి  అనుమతిని రద్దు  చేయాలని ఇంటర్ బోర్డు  నిర్ణయం తీ'సుకున్నారు.  

గత  నెల  28వ తేదీన  ఈ కాలేజీలో  ఇంటర్ ఫస్టియర్ చదివే  సాత్విక్ అనే విద్యార్ధి  ఆత్మహత్య  చేసుకున్నాడు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. 

Latest Videos

undefined

ఇవాళ  కార్పోరేట్ కాలేజీలతో   ఇంటర్ బోర్డు  హైద్రాబాద్ లో  సమావేశం నిర్వహించింది.ఈ సమావేశంలో  ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధి  సాత్విక్ మృతిపై  శ్రీచైతన్య కాలేజీ సంస్థల ప్రతినిధులు  క్షమాపణలు  చెప్పారు. అయితే  ఈ ఘటనపై క్షమాపణ చెప్పడం చాలా చిన్న విషయంగా  ఇంటర్  బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్  అభిప్రాయపడ్డారు. 

నార్సింగి శ్రీచైతన్య కాలేజీలో  సాత్విక్ ఆత్మహత్య  ఘటనపై  ప్రభుత్వం  కమిటీని  ఏర్పాటు  చేసింది.  ఈ కమిటీ  ప్రాథమిక నివేదికను  ప్రభుత్వానిక అందించింది.  శ్రీచైతన్య కాలేజీలో  సాత్విక్ పై వేధింపులు  నిజమేనని  ఈ కమిటీ తేల్చి చెప్పింది.  కార్పోరేట్ కాలేజీల్లో  విద్యార్ధులు పడుతున్న ఇబ్బందుల గురించి  కూడా కమిటీ  ప్రభుత్వానికి  కమిటీ నివేదికను ఇచ్చింది. 

శ్రీచైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్ధి సాత్విక్ ను  గతంలో  కూడా  లెక్చరర్లు  కొట్టారు.   ఈ ఘటనలో  15 రోజుల పాటు   సాత్విక్  ఇంటి వద్దనే  ఉన్నాడని  పేరేంట్స్ గుర్తు  చేస్తున్నారు. సాత్విక్  ఆత్మహత్యకు గల కారణమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని పోలీసులు  అరెస్ట్  చేశారు.  ఆత్మహత్య  చేసుకొనే ముందే  సాత్విక్ సూసైడ్  లెటర్ రాశాడు. కాలేజీలో  తనను  ఏ రకంగా వేధింపులకు గురి చేశారనే విషయమై ఆ లేఖలో  పేర్కొన్నాడు  సాత్విక్.

సాత్విక్ ఆత్మహత్య  ఘటనతో  విద్యార్ధి సంఘాలు  పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి.  మంత్రి సబితా ఇంద్రారెడ్డి  ఇంటిని  విద్యార్ధి సంఘాల నేతలు ముట్టడించారు.  ఇంటర్ బోర్డు ముందు  కూడా విద్యార్ధి సంఘాలు  ఆందోళనలు  నిర్వహించాయి.

also read:సాత్విక్ ఆడ్మిషన్ మరో కాలేజీలో ఉన్న విషయం తెలియదు: పేరేంట్స్

విద్యార్ధులపై  కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి తీసుకువస్తున్నాయని  విద్యార్ధి సంఘాలు  ఆరోపిస్తున్నాయి.  ఏదైనా సంఘటన జరిగిన సమయంలో  హడావుడి  చేయడం  మాని ఇలాంటి  ఘటనలు  పునరావృతం కాకుండా  చర్యలు తీసుకోవాలని  విద్యార్ధి సంఘాలు  కోరుతున్నారు.
 

click me!