భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీకి టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్:భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై క్రమశిక్షణ కమిటీకి టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ సోమవారం నాడు ఫిర్యాదు చేశారు.టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ తనయుడు సుహాస్ కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బెదిరించినట్టుగా ఉన్న ఆడియో కలకలం రేపుతుంది. తనకు వ్యతిరేకంగా మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చారు. చెరుకు సుధాకర్ కోసం కొందరు తిరుగుతున్నాయని కూడా వెంకట్ రెడ్డి అన్నట్టుగా ఆ ఆడియోలో ఉంది. అయితే భావోద్వేగంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ ఈడియో పై వివరణ ఇచ్చారు. ఈ విషయాన్ని పెద్దది చేయవద్దని కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరణ ఇచ్చారు.
also read:భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలే తప్ప వేరే ఉద్దశం లేదు.. వివాదాస్పద ఆడియో క్లిప్‌పై కోమటిరెడ్డి వివరణ.
అయితే ఈ వ్యాఖ్యలను చెరుకు సుధాకర్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. గత ఏడాది చివరలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల సమయంలో చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో చెరుకు సుధాకర్ తనను ఓడించేందుకు ప్రయత్నించిన చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకోవడంపై కూడ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరుకు సుధాకర్ పార్టీలో చేరే సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నాడు.
చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకొనే విషయమై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసందే. ఈ గ్యాప్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే చెరుకు సుధాకర్ పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ లో బెదిరింపులకు దిగినట్టుగా చెబుతున్నారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేత అద్దంకి దయాకర్ ఈ వ్యాఖ్యలను తప్పు బట్టారు. స్వంత పార్టీ నేతనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బెదిరించడం సరైందా అని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు.
మునుగోడు ఉప ఎన్నికల సమయం నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి.