తెలంగాణా ఆసుపత్రులు రేపటినుంచి రంగులమయం

Published : May 07, 2017, 12:19 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
తెలంగాణా ఆసుపత్రులు రేపటినుంచి  రంగులమయం

సారాంశం

 రాష్ట్రంలోని హాస్పిటల్స్ లో  సోమవారం ఒకేరోజున 51, 998  రంగు రంగుల చెద్దర్లు పంపిణీ చేస్తున్నారు. ఇది పింక్ తో మొదలవుతుంది.  రోజుకో రంగు .ప్రతిరోజూ బెడ్ షీట్స్ ని ఫ్రెష్ గావేస్తారు. దీనితో తెలంగాణ హాస్పిటల్స్ బెడ్ షీట్స్ కొర త తీరడమేగాక, ఇన్ఫెక్షన్ బాధలు తగ్గుతాయి. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క రంగు ఉంటుంది కాబట్టి ప్రతిరోజు బెడ్ షీట్స్ మారుస్తున్నారా  లేదా అనేది తెలిసిపోతుంది.

మొదట తెలంగాణ పింక్ డే కి  సిద్ధమైంది.

 

 రాష్ట్రంలోనిసర్కారుదవాఖానాలన్నీ గులాబీమయం కానున్నాయి.  సోమవారంఅన్ని ప్రభుత్వవైద్యశాలల్లోపింక్ బెడ్ షీట్స్ పరచనున్నారు.

 

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మల్యేలు,ప్రజాప్రతినిధులుఅంతాపాల్గొననున్నారు. రాష్ట్రంలోనిమొత్తం 20 వేల పింక్ బెడ్ షీట్స్  పంపిణీ చేయాలనినిర్ణయించారు. ప్రస్తుతం 10,737 బెడ్స్ కి 51,998 బెడ్షీట్స్అందుబాటులోకివచ్చాయి. వాటిని వివిధహాస్పిటల్స్కిఅందిస్తున్నారు. మిగతాహాస్పిటల్స్ కి త్వరలోనే పంపిణీచేస్తారు. ఒకేరోజుబెడ్ షీట్లపంపిణీకి 19,974 గులాబీ, 19,974 తెల్లబెడ్షీట్స్, 6,025 లేతనీలం, 6,025 ముదురునీలంబెడ్షీట్స్ఆయాహాస్పిటల్స్ లో పరచడానికిసిద్ధంగాఉన్నాయి.

 

 రాష్ట్రంలోనిహాస్పిటల్స్ ల్లో  సోమవారంఒకేరోజున 51, 998 చెద్దర్లుపంపిణీచేస్తున్నారు. దీనితో తెలంగాణహాస్పిటల్స్ బెడ్ షీట్స్ కొర త తీరడమేగాక, ఇన్ఫెక్షన్ బాధలుతగ్గుతాయి. అలాగేప్రతిరోజూ బెడ్ షీట్స్ ని ఫ్రెష్ గావేస్తారు.ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క రంగు ఉంటుంది కాబట్టి ప్రతిరోజు బెడ్ షీట్స్ మారుస్తారా లేదా అనేది తెలిసిపోతుంది.

 

"ఇప్పటి దాకా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నిరోజులకుఒకసారిమారుస్తారో,అసలుమారుస్తున్నారో, లేదోకూడాతెలిసేదికాదు. దీంతోఅనేకఇన్ఫెక్షన్లతో రోగులు బాధలుపడాల్సివచ్చేది. దీనికి విరుగుడుగా,వైద్యఆరోగ్యశాఖమంత్రిగాబాధ్యతలుచేపట్టినవెంటనే, ఆలోచనచేసినమంత్రిలక్ష్మారెడ్డి, ఇన్నిరోజులకు పకడ్బందీగా ఆచరణకు తెచ్చారు.ఇక సోమవారంనుండి ఖచ్చితంగా ప్రతిరోజుబెడ్షీట్స్ మార్చాల్సిందే. సోమవారంపింక్ వేస్తే, మంగళవారంతెల్లచెద్దర్లువేస్తారు. అలారోజూచెద్దర్లుమారుస్తారు. పక్కాగా చెద్దర్లు మారుస్తున్న  విషయంకూడా పేషంట్లకి అర్థం అవుతుంది,’ అని తెలంగాణా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 

 

" పండుగవాతావరణాన్ని మరిపించే ఈగులాబీ, తెల్లచెద్దర్ల పంపిణీ కార్యక్రమాల్లో భాగంగా సిద్దిపేటప్రభుత్వఏరియాహాస్పిటల్లో భారీనీటిపారుదలశాఖమంత్రిహరీష్ రావు తో వైద్య  ఆరోగ్యశాఖమంత్రిడాక్టర్సిలక్ష్మా రెడ్డిపాల్గొంటారు. వైద్యశాలలో గులాబీ చెద్దర్లు పరుస్తారు" అని ఈ ప్రకటనలో చెప్పారు. 

 

 

PREV
click me!

Recommended Stories

Jabardasth Anchor Rashmi Gowtham Pressmeet: మీ సంస్కృతి అంతా మా బట్టలపైనే ఉంది| Asianet News Telugu
Harish Rao Comments on Revanth Reddy:టెండర్లురద్దు చేసి సిబిఐవిచారణ జరిపించాలి | Asianet News Telugu