ఊట్నూర్ ను రణరంగంగా మార్చిన వాట్సాప్ మెసేజ్

Published : May 07, 2017, 11:37 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
ఊట్నూర్ ను రణరంగంగా మార్చిన వాట్సాప్ మెసేజ్

సారాంశం

ఎస్పీతో సహా పోలీసులకు గాయాలు.. 144 సెక్షన్ విధింపు      

ఓ యువకుడు పంపిన వాట్సాప్ ఆడియో మెసేజ్ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో చిచ్చురేపింది. ఓ వర్గాన్ని కించపరుస్తూ 8 నిమిషాల నిడివి గల వాయిస్‌ మెసేజ్‌ ను ఓ యువకుడు వాట్సాప్ లో షేర్ చేశాడు.

 

తమ వర్గాన్ని కించపరిచేలా ఉందని భావించిన కొందరు పోస్టు చేసిన యువకుడిని అరెస్టు చేయాలని రోడ్లపై ఆందోళనకు దిగారు. అదే సమయంలో అవతలి వర్గం వారు కూడా పెద్ద సంఖ్యలో గుమిగూడి ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 

పోలీసులు నచ్చజెప్పినా ఫలితం లేకపోవడంతో అల్లరిమూకలను తరిమి కొట్టేందుకు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. దీంతో రెచ్చిపోయిన రెండువర్గాలూ రాళ్లు విసురుకోవడంతో పోలీసులతో పాటు స్థానికులకు గాయాలయ్యాయి.

 

మండల కేంద్రంలో ప్రస్తుతం 144 సెక్షన్‌ విధించారు.అల్లరి మూకలు జరిపిన దాడిలో జిల్లా ఎస్పీ, డీఎస్పీలకు కూడా గాయాలయ్యాయి. కలెక్టర్‌ బుద్ధ ప్రసాద్‌ ఆదేశాల మేరకు డీఐజీ రవి వర్మ సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో కొత్త‌గా ఎలివేటెడ్ కారిడార్లు.. ఈ ప్రాంతాల్లో భూముల ధ‌ర‌లు పెర‌గ‌డం ఖాయం
Holidays : జనవరి 2026 లో ఏకంగా 13 రోజులు సెలవులే.. అన్నీ లాంగ్ వీకెండ్స్..!