బిజెపిలో చేరాక ఎంత జ్ఙానమొచ్చిందో ఆయనకు

First Published May 6, 2017, 1:55 PM IST
Highlights

ఢిల్లీ  వెళ్లొచ్చాక మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్  బాగా జ్ఞానసంపన్నుడయ్యాడు.

ఆయన చాలా కొత్త విషయాలు చెబుతున్నారు.పాత వాటికి కొత్త అర్థాలుకూడా తీస్తున్నారు. 

ఇదంతా ఆయనీ మధ్య తెలంగాణా బిజెపి అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తో కలసి ఢిల్లీ  వెళ్లి బిజెపిలో చేరాక వచ్చిన మార్పు. 

ఢిల్లీకి వెళ్లొచ్చాక మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్  బాగా జ్ఞానసంపన్నుడయ్యాడు. ఆయన చాలా కొత్త విషయాలు చెబుతున్నారు.పాత వాటికి కొత్త అర్థాలుకూడా చెబుతున్నారు. ఇదంతా ఆయనీ మధ్య తెలంగాణా బిజెపి అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తో కలసి ఢిల్లీ  వెళ్లి బిజెపిలో చేరారు. అంతే, ఆయనలో ఎనలేని పరివర్తన వచ్చేసింది.

 

గత ఎన్నికల్లో పటాన్ చెరు నుంచి కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో కనిపించడం మానేశారు. ఇపుడాయన పబ్లీకున కనిపించడమే కాదు,విశేషాలెన్నో  చెబుతున్నారు. తప్పయిన ఒప్పయినా ఆయన చెప్పేవేమిటో విందాం.

 

‘కాంగ్రెస్‌ పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం లేదు. దేశాభివృద్ధి ఒక్క ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యమవుతుంది,’ అని అన్నారు. అంతేకాదు, తానెందుకు భారతీయ జనతా పార్టీలో చేరారో కూడా ఆయన శెలవిచ్చారు.

 

‘నోట్ల రద్దు, బీసీ కమిషన్‌కు రాజ్యంగబద్ధ హోదా కల్పించడం వంటి నిర్ణయాలు గొప్పవి. అవే బీజేపీలో చేరేందుకు కారణం,’ అని  గౌడ్ సాబ్ చెప్పారు.

 

ఇక తెలంగాణా రాష్ట్ర సమితిలోకి ఫిరాయిస్తున్నవారి గురించి మాట్లాడుతూ వాళ్లంతా టిఆర్ ఎస్ లో చేరింది కేసీఆర్‌ను చూసి కాదని కేవలం తెలంగాణా కోసమేనని అన్నారు.

 

ఈ విషయాలను ఆయన శనివారమిక్కడ విలేకరులతో చెప్పారు.

 

‘కెసిఆర్ బంగారు తెలంగాణా ఎక్కడ? అని అడిగారు.

 

‘కేసీఆర్‌ రోజూ బంగారు తెలంగాణ అంటారు, అదెక్కడుంది.ముఖ్యమత్రి ఇల్లు మాత్రం బంగారుమయయింది తప్ప బంగారు తెలంగాణా ఎక్కడా కనిపించడంలేదు,’ ఎగతాళి  చేశారు.

 

ఇక ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌ షా లను కొనియాడారు. వారిద్దరూ దేశంలో  రామరాజ్య స్థాపనకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు..

 

 

click me!