ఎమ్మెల్సీ ఎన్నికలు: తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ ఓటుపై వివాదం

By narsimha lodeFirst Published Mar 14, 2021, 11:44 AM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వినియోగించుకొన్న ఓటుపై వివాదం చోటు చేసుకొంది. హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోంమంత్రి మహమూద్ అలీ ఆదివారం నాడు ఓటు హక్కును వినియోగించుకొన్నారు.


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వినియోగించుకొన్న ఓటుపై వివాదం చోటు చేసుకొంది. హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోంమంత్రి మహమూద్ అలీ ఆదివారం నాడు ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

హైద్రాబాద్ ఓల్డ్ మలక్‌పేటలోని వ్యవసాయ కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ ఓటు హక్కును వినియోగించుకొన్నారు.ఓటు హక్కును వినియోగించుకొన్న తర్వాత ఆయన మీడియాతో చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.

ఓల్డ్ మలక్‌పేటలోని 580 పోలింగ్ బూత్ లో తమ పార్టీ అభ్యర్ధి సురభి వాణి మేడమ్ కు ఓటు వేశానని ఆయన చెప్పారు. ఎవరికి ఓటు వేశామో బహిరంగంగా చెబితే ఆ ఓటు చెల్లదు. గతంలో ఎన్నికల కమిషన్ ఈ రకమైన ఆదేశాలు జారీ చేసింది.

హోంమంత్రి వ్యాఖ్యలపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎన్నికల కమిషన్ అధికారులు ప్రకటించారు.  రిటర్నింగ్ అధికారి నుండి  ఫిర్యాదు అందితే మంత్రి ఓటు విషయాన్ని పరిశీలిస్తామని అధికారులు ప్రకటించారు.

హోంమంత్రి తనయుడు మహమ్మద్ అజాం అలీ  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా తన ఓటు హక్కును అజాంపురా లోని అడమ్స్ స్కూల్ లో వినియోగించుకున్నారు.

click me!