కార్యకర్తలపై వేధింపులు: ఖమ్మం టూటౌన్ పీఎస్ ముందు భట్టి విక్రమార్క ధర్నా

Published : Mar 14, 2021, 10:34 AM IST
కార్యకర్తలపై వేధింపులు: ఖమ్మం టూటౌన్ పీఎస్ ముందు భట్టి విక్రమార్క ధర్నా

సారాంశం

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ  ఖమ్మం టూటౌన్ పోలిస్ స్టేషన్ ముందు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆదివారం నాడు ధర్నాకు దిగారు.

ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ  ఖమ్మం టూటౌన్ పోలిస్ స్టేషన్ ముందు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆదివారం నాడు ధర్నాకు దిగారు.

తమ పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురి చేయడాన్ని నిరసిస్తూ భట్టి విక్రమార్క  పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు.పోలీసుల తీరును  భట్టి విక్రమార్క తీవ్రంగా తప్పుబట్టారు.  అక్రమంగా తమ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని ఆయన నిరసించారు.  పోలీసుల తీరును ఆయన తప్పుబట్టారు. 

పెట్రోల్, డీజీల్ ధరల పెంపును నిరసిస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సైకిల్ యాత్రను నిర్వహించారు. పార్టీకి చెందిన కొందరు నేతలు కూడ ఈ సైకిల్ యాత్రలో పాల్గొన్నారు.

ఈ సైకిల్ యాత్రకు ముందుగా రైతుల సమస్యలను తెలుసుకొనేందుకు ఆయన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించారు. రైతుల సమస్యలను తెలుసుకొన్నారు.ఈ అంశాలను అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

Mutton : కిలో చికెన్ ధరకే కిలో మటన్.. ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే..!
Kavitha Emotional Speech: నా మీద కక్ష కట్టి పార్టీ నుంచి నెట్టేశారు | Asianet News Telugu