తెలంగాణలో బీజేపీపై పవన్ ఫైర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణికి మద్దతు

By narsimha lodeFirst Published Mar 14, 2021, 11:28 AM IST
Highlights

తెలంగాణలోని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీ కూతురు సురభివాణికి మద్దతిస్తున్నట్టుగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

హైదరాబాద్: తెలంగాణలోని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీ కూతురు సురభివాణికి మద్దతిస్తున్నట్టుగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైద్రాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో  ఆదివారం నాడు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

బీజేపీ కేంద్ర నాయకత్వం తమతో ఉన్నా... రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకత్వం కుట్ర చేసిందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు జనసేనను అవమానించారని  ఆయన చెప్పారు.జనసేనను చులకన చేసి బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాట్లాడిందని ఆయన ఆరోపించారు. 

భూసంస్కరణలను అమలు చేసేందుకు తన ముఖ్యమంత్రి పదవినే పీవీ నరసింహారావు వదులుకొన్నారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర రాజకీయాల నుండి ఢిల్లీకి వెళ్లినప్పటికీ అక్కడా కూడ ఆయనకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదన్నారు. 

అయితే చివరికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయనకు ప్రధాని పదవిని అప్పగిస్తే ఆర్ధిక సంస్కరణలను అమలు చేసి దేశాన్ని ముందుకు నడిపారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

 అలాంటి మహనీయుడు  చనిపోయిన సమయంలో కనీసం ఆయన చితి కూడ సరిగా కాలకుండా అవమానించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బలహీనవర్గాలకు రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తామన్నారు. 


 

click me!