కోలుకొన్న హోంమంత్రి మహమూద్ అలీ: ఆసుపత్రి నుండి డిశ్చార్జ్

Published : Jul 03, 2020, 05:14 PM IST
కోలుకొన్న హోంమంత్రి మహమూద్ అలీ: ఆసుపత్రి నుండి డిశ్చార్జ్

సారాంశం

తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కరోనా నుండి కోలుకొన్నారు. శుక్రవారం నాడు ఆయన  ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.  


హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కరోనా నుండి కోలుకొన్నారు. శుక్రవారం నాడు ఆయన  ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.

గత నెల 29వ తేదీన తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కరోనా లక్షణాలతో జూబ్లీహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు.ఆస్తమా ఉండడంతో ముందు జాగ్రత్తగా ఆయన ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు.  అయితే తనకు కరోనా లేదని హోం మంత్రి రెండు రోజుల క్రితం ప్రకటించారు. 

also read:తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్

ఇవాళ ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో నలుగురు ఎమ్మెల్యేలు కరోనా  బారినపడ్డారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డిలు కరోనా బారినపడ్డారు. 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు కూడ  కరోనా బారినపడ్డారు. ఆయన కూడ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకొన్నారు. రెండు రోజుల క్రితమే ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.
 

PREV
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!